Pooja Hegde Purchased Sea-facing New Home in Mumbai: కొన్నేళ్లుగా బుట్టబొమ్మ పూజా హెగ్డేకి ఒక్క హిట్ కూడా పడలేదు. ఏ ముహూర్తాన ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేసిందో కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు అమ్మడు ఒక్క హిట్ అందుకున్న పాపాన పోలేదు. పోనీ.. ఆమె చేసినవి మాములు సినిమాలా అంటే.. అది కాదు. స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగు, తమిళ్.. చివరికి హిందీలో కూడా అమ్మడిని ఎవరు కాపాడలేకపోయారు. ఇక గతేడాది నుంచి అయితే పూజా హెగ్డే ఫోటోషూట్స్ కే పరిమితమయ్యింది.
గుంటూరు కారం సినిమా చేస్తే.. కనీసం ఒక సినిమా అయినా చేసింది అనుకునేవాళ్లు. ఇప్పుడు అది కూడా లేదు. ఇక ఇవన్నీ పక్కనపెడితే.. ఈ చిన్నది ముంబైకు మకాం మార్చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిన్నది ముంబైలోని బాంద్రాలో ఒక ఇల్లును కొనుగోలు చేసిందంట. దాని విలువ దాదాపు రూ. 45 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఈ ఇంటికి పూజా.. దగ్గరఉండి హంగులు అద్దిస్తుందని సమాచారం.
Also Read: War 2 – Tripti Dimri: ‘వార్ 2’.. ఎన్టీఆర్ కోసం ‘యానిమల్’ బ్యూటీని రంగంలోకి దించారా?
సముద్రానికి ఎదురుగా ఉన్న 4,000 అడుగుల చదరపు విలాసవంతమైన ప్లాట్ లో అమ్మడు తనకు నచ్చినట్లు డిజైన్ చేయించుకుంటుదని అంటున్నారు. త్వరలోనే ఈ ఇల్లు పూర్తికానుందని, వెంటనే ఈ చిన్నది గృహప్రవేశం చేయనుందని తెలుస్తోంది. అయితే అవకాశాలు లేకపోయినా కూడా పూజా ఇంత ఖరీదైన ప్లాట్ కొన్నది అంటే అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం పూజా.. షాహిద్ కపూర్ సరసన దేవా సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమాతోనైనా అమ్మడు హిట్ అందుకుంటుందేమో చూడాలి.