Tollywood: దివంగత నటి స్మిత పాటిల్(Smita Patil), నటుడు రాజ్ బబ్బర్(Raj Babbar)కుమారుడు ప్రతీక్ బబ్బర్ (Prateik babbar) ఫిబ్రవరి 14వ తేదీన ప్రముఖ నటి ప్రియా బెనర్జీ (Priya Banerjee) ని వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి తన కుటుంబ సభ్యులను ఎవరిని ఆహ్వానించకపోవడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయంపై ప్రతీక్ బబ్బర్ సవతి సోదరుడు ఆర్య బబ్బర్ నిరాశ వ్యక్తం చేస్తూ.. తమ సోదరుడు వివాహానికి పిలవకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తూ విమర్శలు కూడా గుప్పించాడు. “కుటుంబంలో గొడవలు రావడం సహజమే కానీ కన్న తండ్రిని కూడా వివాహానికి పిలవకపోవడం మాకు చాలా బాధ కలిగించింది” అంటూ ఆర్య తెలిపాడు. అయితే ఇదే విషయంపై ప్రతీక్ బబ్బర్ సోదరి మాట్లాడుతూ..”మా తమ్ముడు వివాహానికి పిలవకపోయినా పర్వాలేదు. కనీసం ఈ రెండో పెళ్లితోనైనా వాడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ తెలిపింది.
ఇకపోతే వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజులకి విరామంగా తన పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ వస్తోంది ప్రియా బెనర్జీ. అందులో భాగంగానే ప్రియా బెనర్జీతో పాటు పూజా హెగ్డే (Pooja Hegde) కూడా ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన ఫ్రెండ్ పెళ్లికి హాజరైతో సంతోషకరమైన క్షణాన్ని పంచుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే ప్రియా బెనర్జీ పెళ్లిలో పూజా హెగ్డే కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ప్రియా బెనర్జీ కెరియర్..
2013లో తెలుగులో వచ్చిన ‘కిస్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రియా బెనర్జీ. ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్గా పనిచేసింది. ఆ తర్వాత కాలంలో హిందీ, తమిళ్, తెలుగు చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. 1990 ఏప్రిల్ 16న కెనడాలో జన్మించిన ఈమె.. ఇండియాకి వచ్చి ఇక్కడే పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ప్రియా బెనర్జీ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. చిన్నతనం నుండే నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె నటిగానే స్థిరపడాలనుకుంది. అలా 2011లో మిస్ వరల్డ్ కెనడా గా ఎంపికైన ఈమె డిగ్రీ తర్వాత ముంబైకి వచ్చి మూడు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకుంది. ఆ తరువాత యాడ్స్ లో నటించింది.అలా యాడ్స్ లో ప్రియాని చూసిన అడివి శేష్ (Adivi shesh) కిస్ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాకి అడివి శేష్ దర్శకత్వం వహించడమే కాకుండా అదే సినిమాలో హీరోగా నటించారు. సెప్టెంబర్ 12 2013లో విడుదలైన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి పేరు దక్కించుకుంది.
ప్రియా బెనర్జీ నటించిన తెలుగు చిత్రాలు..
కిస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియా బెనర్జీ.. తెలుగులో జోరు, అసుర వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. అంతేకాదు ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో రానా సరసన నటించి ఆకట్టుకుంది. ఇక అటు సినీ సెలబ్రిటీలతో కూడా మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా రహస్యంగా చేసుకున్న పెళ్లికి పూజా హెగ్డే హాజరయ్యింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.