Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ… కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య… లీగ్ దశలో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ టీం… మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం.. తీసుకుంది. దీంతో రోహిత్ సేన మొదట బౌలింగుకు దిగనుంది.
చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఇప్పటికే ప్రారంభం కాగా… ఇవాళ రెండవ మ్యాచ్ జరుగుతుంది. నిన్న న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇవాళ టీమిండియా.. ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడుతోంది. ఇందులో.. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 గురించి చూసినట్లయితే… ఓపినర్లుగా రోహిత్ శర్మ, గిల్ బరిలో దిగబోతున్నారు. మొదటి వికెట్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. అలాగే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ పాత్ర పోషించబోతున్నారు. వీరికి తోడు రవీంద్ర జడేజా కూడా… దుమ్ము లేపేందుకు సిద్ధమయ్యాడు.
అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ తొలి మ్యాచ్ లో అతనికి స్థానం ఇవ్వలేదు టీం ఇండియా మేనేజ్మెంట్. అతని స్థానంలో హర్షిత్ రానాకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే మహమ్మద్ షమీ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. ఇక స్పిన్నర్లుగా… జడేజా అలాగే అక్షర్ పటేల్.. తమ పాత్ర పోషించబోతున్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా సహాయం చేస్తాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ… రాణిస్తే ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందని అందరూ అంటున్నారు. ఇది ఇలా ఉండగా… ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించనున్నారు. దీంతోటి మీడియా ఆడే ప్రతి మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది. ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్, స్పోర్ట్స్ 18, అలాగే… స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్లు తిలకించవచ్చు.
ఇరు జట్ల వివరాలు
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్