BigTV English

Poonam Kaur: త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ముందా.. నిర్మాతపై మండిపడ్డ పూనమ్

Poonam Kaur: త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ముందా.. నిర్మాతపై మండిపడ్డ పూనమ్

Poonam Kaur: ప్రస్తుతం నటి పూనమ్ కౌర్ గురించి తెలియని  తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. పవన్ తనను మోసం చేశాడని, త్రివిక్రమ్ తనను వేధించాడని పోస్టులు చేస్తూ ఉంటుంది. జానీ మాస్టర్ కేసు తరువాత ఆమె త్రివిక్రమ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


త్రివిక్రమ్ తనను వేధించాడని, అతనిపై మా అసోసియేషన్  లో ఫిర్యాదు చేసినా తీసుకోలేదని.. ఇప్పుడైనా త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని  ఆమె డిమాండ్ చేసింది. ఇక ఇప్పటివరకు గురూజీ.. గురూజీ అని ఇన్  డైరెక్ట్ గా కౌంటర్లు వేసిన పూనమ్.. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ పేరును తీసి మాట్లాడడం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. అంతేకాకుండా  వేధించింది త్రివిక్రమ్ నే అయినా .. దానివెనుక పవన్ ఉన్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈలోపే  నిర్మాత చిట్టిబాబు.. పూనమ్ పోస్టుల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

పూనమ్ అన్ని పిచ్చి పిచ్చి ట్వీట్స్ వస్తుందని, ఆమెకు అంత ధైర్యం ఉంటే వచ్చి ఫిర్యాదు చేయాలనీ అన్నాడు. అంతేకాకుండా ఏం జరిగిందో బయటకు వచ్చి చెప్తేనే తెలుస్తుంది. ఇలా ట్వీట్స్ వేయడం వలన అసలు నిజం ఏంటి అనేది అర్ధం కాదు.. ఇప్పటికైనా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలనీ కోరుతున్నాను అంటూ మాట్లాడాడు. ఇక ఆ ఇంటర్వ్యూకు  సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. చిట్టిబాబుపై పూనమ్ మండిపడింది. త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ము లేదు కానీ, ఏం తెలియకుండా మాట్లాడతారు అని ఫైర్ అయ్యింది.


” మీకు త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ముందా.. ? మీరు ప్రశ్నించరు.. ప్రశ్నించలేరు. నేను మీలా వెన్నుముక లేనిదానిని కాదు. అందుకే నేను ప్రశిస్తున్నాను.  నా మీద కామెంట్ చేయడం కాకుండా త్రివిక్రమ్ ను అడిగే ధైర్యం చేయండి” అని చెప్పుకొచ్చింది. ఇక ఇంకొక ట్వీట్ లో ..  నిర్మాత  చిట్టిబాబుకు ఏమి తెలియదని, ఫిర్యాదు ఇచ్చి చాలా రోజులు అయ్యిందని చెప్పింది.

నేను కొన్ని రోజుల క్రితమే ఫిర్యాదు ఇచ్చాను.. అసలు ఫిర్యాదు ఇవ్వలేదని అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఒక మహిళపై ఇంత భయంకరంగా మాటలు అనకూడదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి పూనమ్  ట్వీట్స్ పై చిట్టిబాబు ఎలా  స్పందిస్తాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×