BigTV English

Prabhas: ప్రభాస్ కు స్టెప్స్ నేర్పించిన రాకేష్ మాస్టర్.. నిజంగానే శేఖర్ మాస్టర్ ఆయనను తొక్కేశాడా.. ?

Prabhas: ప్రభాస్ కు స్టెప్స్ నేర్పించిన రాకేష్ మాస్టర్.. నిజంగానే శేఖర్ మాస్టర్ ఆయనను తొక్కేశాడా.. ?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో ప్రభాస్ ను చూసి.. అసలు ఇతను హీరో ఏంటి.. ? అనుకున్నారు. ప్రోపర్ హీరో లుక్ లేదని తీసిపడేశారు.  ఇక ఈశ్వర్ తరువాత వర్షం సినిమాతో డార్లింగ్ హీరోగా నిలబడ్డాడు. ఇక దాని తరువాత వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. అయితే మొదటి నుంచి ప్రభాస్ కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ఇంకా చెప్పాలంటే డ్యాన్స్ కోసమే డార్లింగ్ సినిమాల్లోకి వచ్చాడని టాక్.


ఈశ్వర్ నుంచి బాహుబలి వరకు ప్రతి సినిమాలో ప్రభాస్  డ్యాన్స్ చేస్తూ వచ్చాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంత ఫాస్ట్ గా  డార్లింగ్ డ్యాన్స్ చేయకపోయినా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గ్రేస్ ఉంటుంది. ఆరడుగుల ఎత్తు కావడంతో హెవీ డ్యాన్స్ మూమెంట్స్  చేయలేకపోయాడు. ఇప్పుడు ప్రభాస్ డ్యాన్స్  గురించి చర్చ ఎందుకు వచ్చిందంటే..  ఆయన డ్యాన్స్ నేర్చుకుంటున్న ఒక రేర్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇప్పుడంటే కొరియోగ్రాఫర్ అనగానే.. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అని టక్కున చెప్తున్నారు కానీ, అప్పట్లో రాకేష్ మాస్టర్ కు కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు ఉండేది. అతని దగ్గరే శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ గా చేశాడు. ఈశ్వర్ కన్నా ముందు ప్రభాస్ డ్యాన్స్ లో మెళుకువలు నేర్చుకోవడం కోసం కృష్ణంరాజు.. రాకేష్ మాస్టర్ ను ఇంటికి పిలిపించి డార్లింగ్ కు డ్యాన్స్ నేర్పించేవారట. ఇక ఒక సాయంత్రం రాకేష్ మాస్టర్.. ప్రభాస్ కు డ్యాన్స్ స్టెప్స్  నేర్పిస్తున్న ఫోటోనే ఇది. ఈ ఫొటోలో శేఖర్ మాస్టర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.  ఈ ఫోటో చూసిన నెటిజన్స్ రాకేష్ మాస్టర్ ను తలుచుకుంటున్నారు.


Actor Nani: అంత నీచమైన పని ఎలా చేసావ్ నాని.. కన్నడ నిర్మాత ఫైర్

ఎప్పటినుంచో రాకేష్ మాస్టర్ ను శేఖర్ మాస్టర్ తొక్కేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటో చూస్తుంటే అది నిజమే అనిపిస్తుందని, డైరెక్ట్ గా ప్రభాస్ కు డ్యాన్స్ నేర్పించడానికి ఇంటికే వెళ్లేవాడట అతని రేంజ్ ఎలాంటిదో అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆట అనే డ్యాన్స్ షో లో డ్యాన్సర్ గా రాకేష్ మాస్టర్ కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత ఎన్నో హిట్ సాంగ్స్  కు ఆయన కొరియోగ్రఫీ అందించాడు. అలా మంచి కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడే శేఖర్ మాస్టర్ తనవద్ద అసిస్టెంట్ గా చేరాడు.

శేఖర్ పెళ్లి కూడా రాకేష్  మాస్టర్ నే దగ్గరుండి చేయించాడు. ఆ తరువాత కొద్దికొద్దిగా శేఖర్ మాస్టర్ కు అవకాశాలు రావడంతో.. రాకేష్ మాస్టర్ ను తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. శేఖర్ ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని, తను చనిపోతే వాడు తన శవాన్ని కూడా తాకడానికి వీల్లేదని రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇలా శేఖర్ మాస్టర్.. రాకేష్ మాస్టర్ గురించి తక్కువ చేసి మాట్లాడి వచ్చిన అవకాశాలను అతను లాక్కొనేవాడని టాక్. ఆ తరువాత అవకాశాలు లేక మద్యానికి బానిసగా మారి.. నోటికి వచ్చింది మాట్లాడి విమర్శలు పాలయ్యాడు. 2023 లో అనారోగ్యానికి గురైన రాకేష్ మాస్టర్ రక్తవిరేచనాలు అయ్యి చికిత్స పొందుతూ మరణించాడు. కొంతవరకు ఆ మద్యం కనుక మాని ఉంటే ఇప్పటికీ రాకేష్ మాస్టర్ బతికి ఉండేవాడని కొందరు చెప్పుకొస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×