Thandel : అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) – సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ (Thandel) ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్లలో తలమునకలై ఉన్నారు. అయితే మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి కారణం ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది అన్న వార్త. సాయి పల్లవికి సంబంధించి ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా వైరల్ అయిపోతుంది. దీన్ని నాగ చైతన్య మూవీ అనడం కంటే సాయి పల్లవి మూవీ అనడం బెటర్ ఏమో అనిపించేలా ఉంది ఈ బ్యూటీ డామినేషన్. తాజాగా ఇదే విషయాన్ని డైరెక్టర్ దగ్గర ప్రస్తావించగా, ఆయన ఊహించని రిప్లై ఇచ్చారు.
సాయి పల్లవి హైలెట్… డైరెక్టర్ రియాక్షన్ ఇదే
‘తండేల్’ (Thandel) మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా డైరెక్టర్ చందూ మొండేటి (Chandu Mondeti) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా “ఇది సాయి పల్లవి సినిమా. ఆమెనే ఎక్కువగా హైలైట్ అవుతోంది అని టాక్ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజం?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ చందూ మొండేటి స్పందిస్తూ “అమరన్ మూవీని చూసే ఉంటారు. ఆ మూవీ వల్ల మీకు ఇలా అనిపించి ఉండొచ్చు. అంటే ఆమె హైలెట్ కావడాన్ని నేను ఖండించట్లేదు. అలాగని ఆమె హైలెట్ అవుతుంది అనేవాళ్ళకి ‘కాదు’ అని కూడా సమాధానం చెప్పట్లేదు. ఒకసారి మూవీ చూస్తే కచ్చితంగా ఎవరు ఎక్కువ అనే డిబేట్ వస్తుంది. అందులో డౌట్ లేదు. కానీ ‘అమరన్’తో పాటు అంతకు ముందు చేసిన సినిమాల వల్ల సాయి పల్లవికి ఇలాంటి పేరు రావడం, సాయి పల్లవి నెయిల్డ్ ఇట్ అనేది మామూలుగా రాసేసి, సినిమా చూసిన తర్వాత అక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టుగా ఉంటుంది. బట్ ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ నాగచైతన్య. నేను ఉన్నంత వరకు నాగచైతన్య అనే వ్యక్తి ఎలివేట్ అవ్వకుండా ఉండడు కదా ” అంటూ సమాధానం చెప్పాడు. దీంతో ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో చూస్తారు… నాగచైతన్య సంభవం ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.
సాయి పల్లవే హీరో..
సాయి పల్లవి (Sai Pallavi) సినిమా చేస్తుందంటే చాలు ఆమెనే అందులో హైలెట్ గా నిలుస్తుంది. ఇందుకు ఉదాహరణ డైరెక్టర్ చందు మొండేటి చెప్పినట్టుగా ‘అమరన్’ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో శివ కార్తికేయన్ కంటే ఎక్కువగా సాయి పల్లవి డామినేషన్ కనిపిస్తుంది. అయితే నేచురల్ బ్యూటీగా సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇలా లేడీ సూపర్ స్టార్ అనిపించుకునే హీరోయిన్లతో నటించడానికి చాలా వరకు హీరోలు ధైర్యం చేయరు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం కంటెంట్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ‘తండేల్’ మూవీని చేశారు. ఈ మూవీ గనక ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇద్దరికీ మంచి బూస్ట్ దొరికినట్టే.