BigTV English

Largest Railway Networks: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాలు, టాప్ 10లో భారత్ ఏ ప్లేస్ లో ఉందంటే?

Largest Railway Networks: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాలు, టాప్ 10లో భారత్ ఏ ప్లేస్ లో ఉందంటే?

World’s Largest Railway Networks: ఏ దేశంలోనైనా ప్రజా రవాణా, సరుకు రవాణాలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తాయి. పలు దేశాల అభివృద్ధిలో రైల్వేలు జీవనాడులుగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలను సుదూర ప్రాంతాలకు సౌకర్యవంతగా తీసుకెళ్లడంలో సాయపడుతున్నాయి. సరుకు రవాణా చేస్తూ వాణిజ్యానికి ఊతం అందిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉన్న టాప్ 10 దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


టాప్ 10 అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి ఉన్న దేశాలు  

⦿ అమెరికా


ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం అమెరికా. 2,93,000 కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. రోజూ సుమారు 85 వేల మంది రైలు ప్రయాణం చేస్తారు. ఎక్కువగా సరుకు రవాణా కోసం రైళ్లను వినియోగిస్తారు.

⦿ చైనా

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన రెండో దేశం చైనా. ఈ దేశంలో 1,50,000 కిలో మీటర్ల రైల్వేలైన్లు ఉన్నాయి. నిత్యం 1.7 కోట్ల మంది ప్రయాణిస్తారు. చైనాలో పలు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. దేశంలోని కీలక నగరాలను కలుపుతూ ఈ బుల్లెట్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి.

⦿ రష్యా

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన మూడో దేశంగా రష్యా గుర్తింపు తెచ్చుకుంది. ఈ దేశంలో మొత్తం 1,05,000 కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. యూరప్, ఆసియాలను కలిపే రష్యాలో నిత్యం రైళ్ల ద్వారా 2.4 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలోని పొడవైన, అత్యంత ముఖ్యమైన రైలు మార్గాలలో ఒకటి ట్రాన్స్-సైబీరియన్ రైల్వే రష్యాలోనే ఉంది.

⦿ ఇండియా

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా 68 వేల కిలో మీటర్లకు పైగా రైల్వే లైన్లు ఉన్నాయి. రోజూ సుమారు 2.4 కోట్ల మంది ప్రయాణీకులు జర్నీ చేస్తారు. తక్కువ ధరలో  సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. సరుకు రవాణాలో కీలకపాత్ర పోషిస్తూ జాతీయ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తున్నాయి.

⦿ కెనడా

ప్రపంచంలోని ఐదో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం కెనడా. 48 వేల కిలో మీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ఈ దేశ జనాభా తక్కువగా ఉన్నా, సరుకును తరలించడం కోసం ఎక్కువగా రైల్వేలను ఉపయోగిస్తున్నారు. కలప, ఖనిజాలు, చమురు లాంటి సహజ వనరులను ఎగుమతి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నది. ఈ దేశంలో రైళ్ల ద్వారా రోజుకు కేవలం 11 వేల మంది ప్రయాణిస్తారు.

⦿ ఆస్ట్రేలియా

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన ఆరో దేశం ఆస్ట్రేలియా. 40 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు ఉన్నాయి. రోజూ 2 లక్షల మంది ప్రయాణిస్తారు. మైనింగ్ రంగానికి చెందిన రవాణాలో ఆస్ట్రేలియన్ రైల్వే కీలక పాత్ర పోషిస్తున్నది.

⦿ జర్మనీ

ప్రపంచంలో ఏడో అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉన్న దేశం జర్మనీ, ఈ దేశంలోనూ పలు హైస్పీడ్ రైళ్లు ఉన్నాయి. యూరప్ అంతటా ముఖ్యమైన పట్టణాలను కలిపే డ్యూష్ బాన్ రైల్వే లైన్ ద్వారా దేశ సరిహద్దుల మీదుగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. 38 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు ఉన్నాయి. రోజూ 50 లక్షల మంది ప్రయాణిస్తారు.

⦿బ్రెజిల్

బ్రెజిల్ 37 వేల కిలో మీటర్ల రైల్వే లైన్లతో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన 8వ దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. రోజూ సుమారు 7 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. పారిశ్రామిక, వ్యవసాయ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది.

⦿ అర్జెంటీనా

36 వేల కిలో మీటర్ల రైల్వే నెట్ వర్క్ కలిగిన అర్జెంటీనా అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి తొమ్మిదవ దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. రోజూ సుమారు 14 లక్షల మంది ప్రయాణిస్తారు. వ్యవసాయ ఎగుమతుల ఈ రైల్వే ఎక్కువగా ఉపయోగపడుతుంది.

⦿జపాన్

జపాన్ 30 వేల కిలో మీటర్ల రైల్వే లైన్లను కలిగి ఉండి, ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాల జాబితాలో 10వ స్థానంలో ఉంది. రోజూ 1.8 కోట్ల మంది రైల్వే ప్రయాణం చేస్తారు. జపాన్ లో అత్యధిక వేగంతో ప్రయాణించే షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లు ఉన్నాయి.

Read Also: కేరళలో అద్భుతమైన రైలు ప్రయాణాలు, మిమ్మల్ని మీరు మైమరిచిపోతారు అంతే!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×