BigTV English
Advertisement

Actor Nani: అంత నీచమైన పని ఎలా చేసావ్ నాని.. కన్నడ నిర్మాత ఫైర్

Actor Nani: అంత నీచమైన పని ఎలా చేసావ్ నాని.. కన్నడ నిర్మాత ఫైర్

Actor Nani: ఇండస్ట్రీలో  రెండు సినిమా కథలు ఒకేలా ఉండడం చూస్తూనే ఉంటాం. ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాలనే.. ఇంకో భాషలో మరో సినిమా ఉండొచ్చు.  ఆ లైన్ ఒకేలా ఉన్నా.. స్టోరీ మారొచ్చు. లేదు.. సినిమా మొత్తం ఒకేవిధంగా ఉంది అంటే అది కాపీ అవుతుంది. లేదు  ఆ సినిమా హక్కులను కొనుగోలు చేసి తీస్తే రీమేక్ అవుతుంది. అయితే తనవద్ద రీమేక్ హక్కులు కొనకుండానే న్యాచురల్ స్టార్ నాని.. తన  సినిమాను కాపీ కొట్టాడని ఒక కన్నడ నిర్మాత ఆరోపించడం సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. అసలు ఆ సినిమా ఏంటి .. ? ఆ నిర్మాత ఎవరు.. ? అనేది చూద్దాం.


న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హయ్ నాన్న. 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని..  భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బాండింగ్ ను ఈ సినిమాలో చూపించారు. ఇక తండ్రి పాత్రలో నాని అదరగొట్టేశాడు. మృణాల్ అందానికి ఫిదా కాని వారుండరు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు అవార్డులను కూడా  సొంతం చేసుకుంది.

అయితే హాయ్ నాన్న.. కన్నడ సినిమాకు కాపీ అని  నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య  ఆరోపించాడు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నానిపై దుమ్మెత్తిపోశాడు. ” రీమేక్ హక్కులు కొనుగోలు చేయకుండానే తమ సినిమా భీమసేన నలమహారాజాను తెలుగులో హాయ్ నాన్న సినిమా పేరుతో కాపీ చేశారు. ఇలాంటి నీచమైన పని ఎలా చేస్తారు నాని” అంటూ రాసుకొచ్చాడు. ఇక దీంతో మరోసారి నాని సినిమా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.


Andrea Jeremiah: పెళ్లైనవాడితో ఎఫైర్.. నరకం చూపించాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

అరవింద్ అయ్యర్, ఆరోహి నారాయణ్, ప్రియాంక తిమ్మేష్ ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం భీమసేన నలమహారాజా. కార్తీక్ సరగూర్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రాన్ని పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్ పై పుష్కర మల్లికార్జునయ్య నిర్మించాడు. కరోనా సమయంలో ఈ సినిమాను తెరకెక్కించగా..  థియేటర్ లో రిలీజ్ చేయలేక ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమా కథ ఏంటంటే.. లతేశా ఒక చెఫ్. అతను వంట చేస్తే  ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అతనికి ఒక కూతురు ఉంటుంది.  వారిద్దరూ కలిసి  ఒక చిన్న హోటల్ ను నడుపుతూ ఉంటారు. అక్కడికి సారా అనే ఒక అమ్మాయి వస్తుంది. లతేశా వంటకు ఫ్యాన్ అయిపోతుంది. అంతకుముందు ఈ టేస్ట్ తనకు తెలుసు  అన్నట్లు మాట్లాడుటు ఉంటుంది. అలా  వారి మధ్య పరిచయం పెరుగుతుంది. ఇక లతేశాను ఆమె ప్రేమిస్తుంది. కానీ, అతను మాత్రం అందుకు ఒప్పుకోడు. తన జీవితంలో వేదవల్లి అనే అమ్మాయి ఉందని చెప్తాడు. వారిద్దరి ప్రేమకథను విన్న సారా.. వేదవల్లిగా తాను ఉండాలని, అతడిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే దానికి వారి పేరెంట్స్ ఒప్పుకోరు. చివరకు సారా, వేదవల్లి ఒక్కరే అని తెలుస్తోంది. 

సేమ్ హాయ్ నాన్న కథనే. కానీ తెలుగులో నాని.. కూతురు ఎక్కువ కాలం బతకదు అనే ట్విస్ట్ ను ఇచ్చాడు. మిగతాదంతా సేమ్ టూ సేమ్. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. అయితే ఇప్పుడు  కాపీ ఆరోపణలు చేయడం ఏంటి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఈ వివాదంపై నాని ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×