BigTV English
Advertisement

Prabhas Birthday: డార్లింగ్ బర్త్ డే .. భారీ కటౌట్ .. ఫ్యాన్స్ హంగామా ..

Prabhas Birthday: డార్లింగ్ బర్త్ డే .. భారీ కటౌట్ .. ఫ్యాన్స్ హంగామా ..

Prabhas Birthday: టాలీవుడ్ స్టార్ హీరోల బర్త్ డే వస్తుంది అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా రేపు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. ఇక ఫ్యాన్స్ ఏ ఎత్తున దీన్ని సెలబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఆ తరువాత వరుసగా వచ్చిన సినిమాల్లో ఏదీ అనుకున్న సక్సెస్ అందించలేకపోయినప్పటికీ, ఆ ఇమేజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అన్నట్టు మెయింటైన్ అవుతూ వస్తుంది.


ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే చాలావరకు హీరోలు తమ సినిమాలను సైలెంట్ గా వాయిదా వేసుకుంటారు. మామూలుగా టాలీవుడ్ లో ఇతర హీరోలకి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభాస్ కి యాంటీ ఫ్యాన్స్ లేరు సరి కదా హీరోలు , హీరోయిన్స్ సైతం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. కాంట్రోవర్సిస్ కి ఎప్పుడు దూరంగా ఉండే చాలా తక్కువ మంది స్టార్స్ లో ప్రభాస్ కూడా ఒకడు. కేవలం తనకు అవసరమైనంత వరకు.. అది కూడా తన సినిమా వరకు మాత్రమే మాట్లాడి సైలెంట్ అయిపోవడం ప్రభాస్ కి మొదటి నుంచి అలవాటు.

ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఘనంగా జరపడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ నటిస్తున్న ఏదో ఒక సినిమా నుంచి మంచి అప్డేట్ వస్తుందని మరోపక్క అభిమానులు ఎదురుచూస్తున్నారు. రేపు సంక్రాంతి బరిలోకి దిగనున్న ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సలార్ మూవీ నుంచి ట్రైలర్ విడుదలవుతుంది అని అందరూ ఆశించారు. అయితే ఈ విషయంలో ప్రశాంత్ నిల్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.


సలార్ నుంచి ట్రైలర్ కాకపోయినా ఏదో ఒక పోస్టర్ తో మాత్రం ప్రభాస్ కు విషెస్ చెప్పే అవకాశం ఉన్నట్లు టాక్. ఇదిలా ఉండగా హైదరాబాద్ కూకట్​పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో డార్లింగ్ అభిమానులు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా భారీ కటౌట్ ఏర్పాటు చేయబోతున్నారు. కనివిని ఎరుగని విధంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన, పెద్దదైన కటౌట్ ని ఏర్పాటు చేసి సర్ప్రైజ్ ఇవ్వడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎంతో చురుకుగా మంచి జోరు మీద సాగుతున్నాయి.

ఇక సోమవారం ఉదయం 11 గంటలకు ఆ భారీ కటౌట్ పూర్తిస్థాయిలో ఆవిష్కరించబడుతుంది. అలాగే బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహించే విధంగా ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. నెక్స్ట్ ప్రభాస్ నుంచి వరుసగా మంచి క్రేజీ మూవీస్ లైన్ లో ఉన్నాయి. ఈ మూవీల కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×