Jio 5G: 4జీ నెట్‌వర్క్‌తోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇక 5జీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో మరింత రెచ్చిపోతున్నారు. అయితే 5జీ సేవలు కొన్ని కంపెనీలు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో డిసప్పాయింట్మెంట్ తప్పట్లేదు. లేటెస్ట్‌గా రిలయన్స్ జియో మరన్ని సిటీస్‌లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో పలు తెలుగు రాష్ట్రాల నగరాలు సైతం ఉన్నాయి. ఇకనుంచి జియో 5జీ సేవలు అందుబాటులో ఉండే పట్టణాలు ఏవంటే..
తెలంగాణలో: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్‌లో ఇప్పటికే జియో 5జీ నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా.. జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, తాండూరు, జహీరాబాద్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో: విశాఖపట్నం, అనకాపల్లి, మచిలీపట్నం, అనంతపురం, భీమవరం, చీరాల చిత్తూరు, ఏలూరు, గుంతకల్, గుంటూరు, హిందూపూర్, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, నంద్యాల్, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తెనాలి, తిరుమల, తిరుపతి, విజయవాడ, విజయనగరంలో జియో 5జీ సర్వీసులు ఉన్నాయి. తాజాగా తాడిపత్రిలోనూ సర్వీసులు మొదలయ్యాయి.
కొత్తగా 5జీ అందుబాటులోకి తెచ్చిన నగరాల్లో వెల్‌కమ్ ఆఫర్ ప్రకటించింది జియో. అదనపు ఛార్జీలు లేకుండానే 1 జీబీపీఎస్ కంటే ఎక్కువ వేగంతో అపరిమిత డేటా ఇస్తోంది. 2023 డిసెంబర్ నాటికి 5జీ సేవలు ప్రతి పట్టణం/నగరంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.