BigTV English

Goud Saab Pooja Ceremony: ప్రభాస్ సోదరుడి కొత్త సినిమా ‘గౌడ్‌ సాబ్’.. డైరెక్టర్‌గా మారిన కొరియోగ్రాఫర్!

Goud Saab Pooja Ceremony: ప్రభాస్ సోదరుడి కొత్త సినిమా ‘గౌడ్‌ సాబ్’.. డైరెక్టర్‌గా మారిన కొరియోగ్రాఫర్!

Prabhas Cousin Virat Raj and Ganesh Master Combo Goud Saab Pooja Ceremony: టాలీవుడ్ దివంగత సీనియర్ నటుడు కృష్ణంరాజు ఇంటి నుంచి వచ్చిన ప్రభాస్‌ పాన్ ఇండియా రేంజ్‌లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కొన్ని లక్షల్లో ఉంటారు. అయితే ఇప్పుడు మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ హీరో కృష్ణంరాజుకి దూరపు బంధువు. ప్రభాస్‌కి సోదరుడి వరుస అవుతారని తెలుస్తోంది.


అతడే విరాట్ రాజ్. తాను నటిస్తున్న కొత్త చిత్రం ‘గౌడ్ సాబ్’. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ కొత్త సినిమాతో దర్శకుడిగా బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఎన్నో సినిమాల్లో తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన గణేష్ మాస్టర్ ఇప్పుడు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్స కార్యక్రమానికి ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు సుకుమార్ క్లాప్ కొట్టి, విరాట్ రాజ్‌ను ఆశీర్వదించాడు.

Goud Saab:
Goud Saab

అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఓ మూవీ టైటిల్ మాదిరిగానే విరాట్ మూవీ టైటిల్ ఉంది. ప్రభాస్ – మారుతీ కాంబోలో ‘రాజా సాబ్’ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ సోదరుడి వరుస అయిన విరాట్ కూడా సేమ్ అలాంటి టైటిల్‌తో ‘గౌడ్ సాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నాడు.


Also Read: రూ.100 కోట్లు రాబట్టిన లేటెస్ట్ మూవీ.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..!

అయితే విరాట్‌ను చూస్తుంటే అచ్చం ప్రభాస్ మాదిరిగానే చాలా హైట్‌గా కనిపిస్తున్నాడు. దీంతో విరాట్ కూడా మాంచి మాస్, యాక్షన్ సినిమాలకు సెట్ అవుతాడని కొందరు అంటున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ విరాట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ ఫస్ట్ మూవీ మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ మంచి హిట్ అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో తోడు దొరికినట్లే అని చెప్పాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×