Manchu Vishnu : పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి తెలియని వాళ్ళు ఉండరు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సినిమాలు కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు అని అందరూ వెయిట్ చేస్తుంటారు. ప్రభాస్ సినిమాలు కూడా అలాంటి అంచనాలనే క్రియేట్ చేస్తూ ఉంటాయి. కల్కి మూవీ భారీ బడ్జెట్ తో నిర్మించబడింది. సినిమా సూపర్ హిట్ అవడంతో అంతకుమించి కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. ప్రస్తుతం ఆయన అరడజను సినిమాలు చేస్తున్న కూడా మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈరోజు మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. ఇదిలా ఉండగా మంచు విష్ణు ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈరోజు మూవీలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలు చేస్తున్నాడు దాంతో కేవలం ఈ మూవీకి పది రోజులు మాత్రమే డేట్స్ వచ్చాడు. మోహన్ బాబుతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే తను కన్నప్ప సినిమా నటించాడు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమా ఓటిటీ రైట్స్ గురించి కీలక విషయాలను షేర్ చేసుకున్నారు.. అలాగే ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
మంచు విష్ణు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాలో ప్రభాస్ కి స్లీవ్ లెస్ డ్రెస్ వేద్దామని చూశారట. తను చాలా బక్కగా ఉండడం నాలాంటి ఫిజిక్ ను మెయింటైన్ చేయలేకపోవడం వల్లే స్లీవ్ లెస్ కాకుండా ఫుల్ లెంత్ డ్రెస్ వేశామని నాలో సగం మాత్రమే ప్రభాస్ ఉన్నాడని ప్రభాస్ ని తక్కువ చేసేలా మాట్లాడాడు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ విష్ణు మాట లు విని అంతా షాక్ అయ్యారు. మంచు విష్ణు పట్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ఫైర్ అవుతూ ఆయనను ఉద్దేశిస్తూ బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు.. బాహుబలి సినిమాలో రానా కన్నా ప్రభాస్ బాగా కనిపిస్తాడు. అలాంటి ప్రభాస్ ముందర మంచు విష్ణు ఒకపక్క కూడా సరిపోడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మంచు ఫ్యామిలీ అంటేనే కొంచెం అతిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎలాంటి సందర్భంలో ఏ విషయాల స్పందించాలి అనే విషయం కూడా వాళ్లకు తెలీదు.. ఇప్పటివరకు ప్రభాస్ లుక్కు రీవిల్ అవ్వడంతో ఆ సినిమాపై ఆసక్తి పెరిగింది ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా ఆ సినిమాను చూడడానికి ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.. ప్రస్తుతానికి ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. అది కూడా కేవలం ప్రభాస్ వల్లే.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మే ఫస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే..