BigTV English
Advertisement

Iman Esmail: ప్రభాస్- హను సినిమాలో హీరోయిన్ ఆ వీడియోతో బాగా ఫేమస్.. గుర్తుపట్టారా..?

Iman Esmail: ప్రభాస్- హను సినిమాలో హీరోయిన్ ఆ వీడియోతో బాగా ఫేమస్.. గుర్తుపట్టారా..?

Iman Esmail: ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్.. అభిమానులకు ఒక మాట ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకుముందులా.. ఏడాదికి ఒక్క సినిమా కాకుండా.. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఇచ్చిన మాటను ప్రభాస్ రాజు తప్పడు అని అందరికి తెల్సిందే. దాన్ని నిజం చేస్తూ.. ఒక సినిమా పూర్తి అవ్వగానే ఇంకో సినిమాను మొదలుపెడుతున్నాడు.


ఇక ఈ ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఈ సినిమా రిలీజ్ అయ్యిన వెంటనే రాజాసాబ్ ను అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ లో ఉండగానే.. మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. సీతారామం లాంటి క్లాసిక్ సినిమా తరువాత దర్శకుడు హను రాఘవపూడి.. ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ.. నేడు వీరి కాంబో పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది.

మొదటి నుంచి ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మృణాల్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే మృణాల్.. తాను ప్రభాస్ సినిమాలో నటించడం లేదని చెప్పడంతో.. డార్లింగ్ సరసన నటించే ఛాన్స్ ఏ ముద్దుగుమ్మ అందుకుంటుందో అని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసారు. ఎట్టకేలకు ఆ అదృష్టాన్ని పట్టేసింది ఇమాన్ ఇస్మాయిల్. ఈ చిత్రంతోనే ఇమాన్ తెలుగుతెరకు పరిచయమవుతుంది.


టాలీవుడ్ కు అమ్మడు పరిచయం ఇప్పుడే జరిగినా.. సోషల్ మీడియా ఫ్యాన్స్ కు ఈ చిన్నది ఎప్పటి నుంచో పరిచయమే. ప్రతి ఏడాది సోషల్ మీడియాలో ఏదో ఒక సాంగ్ ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. ఇక అలాంటి ట్రెండ్ సెట్ చేసిన సాంగ్స్ లో విశాల్, ఆర్య మల్టీస్టారర్ గా నటించిన ఎనీమీ సినిమాలోని టుం టుం సాంగ్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ తో పాటు చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ సాంగ్ ను రీ క్రియేట్ చేశారు.

ఇక ఈ సాంగ్ ను ఇమాన్ కూడా తన ఫ్రెండ్ తో రీ క్రియేట్ చేసింది. ఆ వీడియో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇమాన్.. ఒక డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్. ఆమె ఎన్నో దేశాల్లో పెర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చింది. ఇక ఈ చిన్నది.. ప్రభాస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతుంది. నిజం చెప్పాలంటే ఇది ఆమెకు ఒక పెద్ద అదృష్టం.

సాధారణంగా టాలీవుడ్ కు కొత్త హీరోయిన్ వచ్చింది అంటే క్రష్ లిస్ట్ లో యాడ్ చేస్తూ ఉంటారు. అలాంటింది ప్రభాస్ హీరోయిన్ అంటే ఊరికే ఉంటారా.. అమ్మడి జాతకాన్ని మొత్తం కనుక్కొని.. సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఇమాన్ ఫేమస్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఈ చిన్నదాన్ని ఏ రేంజ్ లో నిలబెడుతుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×