E-Paper
Advertisement

Prabhas : ప్రభాస్ మరదలు .. మాకు వదినమ్మ అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్ ..

Prabhas : ప్రభాస్ మరదలు .. మాకు వదినమ్మ అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్ ..
Advertisement
Prabhas news today telugu

Prabhas news today telugu(tollywood celebrity news):

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సలార్ గురించే చర్చ జరుగుతుంది. అయితే వీటన్నిటి మధ్యలో ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ మరదలు గురించి కూడా హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ మరదలు అంటే.. మా వదినమ్మ అంటున్నారు ప్రభాస్ అభిమానులు. రీసెంట్ గా ఆమెతో జరిగిన ఒక ఇంటర్వ్యూ క్లిప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ కు ఒక మరదలు ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.

ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. చాలా కాలం నుంచి అనుష్క, ప్రభాస్ మధ్య పెళ్లి జరిగే ఆస్కారం ఉంది అన్న వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరోపక్క ప్రభాస్ పెద్దమ్మ కచ్చితంగా 2024లో ప్రభాస్ పెళ్లి జరిగే తీరుతుంది అని కన్ఫామ్ గా చెప్పారు.మరి ఈ నేపథ్యంలో కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ వదినమ్మ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి..

Advertisement

ప్రభాస్ కు చుట్టమైన ఒక అమ్మాయి వరుసకు అతనికి మరదలు అవుతుంది.. రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు నాడు హ్యాపీ బర్త్ డే బావ అంటూ మెసేజ్ పెట్టడంతో.. ఆమె ప్రభాస్ కు మరదలు అన్న విషయం తెలిసింది. ఇదే విషయం గురించి ఓ యూట్యూబ్ ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రశ్నించారు. ‘మీరు ప్రభాస్ మరదలే కదా.. ప్రభాస్ బర్త్ డే కి బావ అంటూ విషెస్ చెబుతూ పోస్ట్ కూడా పెట్టారు కదా..’ అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ..’ నేను కేవలం నా ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నానే తప్ప డైరెక్టుగా ప్రభాస్ కి బావ అంటూ మెసేజ్ పెట్టే అంత సీన్ లేదు..’ అని అన్నారు. అంతేకాదు ప్రభాస్ కేవలం తనకు వరసకు బావ అవుతారు. అంతే తప్ప మరి ఇంకేం లేదు అని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఏమీ లేని చోట కూడా ఆవకాయ పచ్చడి పెట్టడం బాగా తెలిసిన మన నెటిజన్స్.. ప్రస్తుతం ఈ వార్తను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేస్తూ వదినమ్మ వచ్చేసింది అని హడావిడి చేస్తున్నారు. ప్రభాస్ ఈ సంవత్సరం పెద్దమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాడా లేదా చూడాలి. ఇక పెళ్లికూతురు ఎవరు అన్న విషయం ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యాకే క్లారిటీగా తెలుస్తుంది. మరోపక్క ఆన్ స్క్రీన్ పై సూపర్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్కతో ప్రభాస్ ను చూడాలి అని అతని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో ప్రభాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో.. ఏడడుగులు ఎవరితో వేస్తాడో చూడాలి మరి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×