E-Paper
Advertisement

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?
Advertisement

RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. యాక్షన్ సినిమాలు చేసి చేసి విసిగిపోయిన డార్లింగ్.. ఈసారి కొద్దిగా చేంజ్ అవ్వాలనుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ పాన్ ఇండియా సినిమాలు, యాక్షన్ సినిమాల మధ్య ఒక కామెడీ సినిమా చేయాలనుకొని ది రాజాసాబ్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్.. ఎన్ని రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హర్రర్ కామెడీ నేపథ్యంలో రాజాసాబ్ తెరకెక్కుతోందని మేకర్స్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇందులో ప్రభాస్ తాతమనవడుగా నటిస్తున్నాడు. మనవడు పోస్టర్ ను ప్రేక్షకులు ఎంత ప్రశంసించారో..  తాత పోస్టర్ రిలీజ్ అయ్యినప్పడు అంతే ట్రోల్ చేశారు. గెటప్ బాలేదని, చంద్రముఖి, నాగవల్లి సినిమాల్లో విలన్ లా ఉన్నాడని ట్రోల్స్ చేశారు. అయితే.. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి.. అందులో కూడా పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరో.. ఇలాంటి ఒక గెటప్ లో కనిపించడం అంటే మాములు విషయం కాదు.

Advertisement

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?

ఫ్యాన్స్ ఒప్పుకోరని తెలుసు.. హేటర్స్ ట్రోల్ చేస్తారని తెలుసు.. అయినా డార్లింగ్ మాత్రం పాత్ర నచ్చడంతో ఆ గెటప్  చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ సినిమాలో ఇంకో సర్ ప్రైజ్ ను మేకర్స్  దాచి ఉంచారట. అందుతున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ లో ప్రభాస్.. ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.  తాతమనవడుగానే కాకుండా మరో పాత్రలో కూడా ప్రభాస్ నే కనిపిస్తాడట. ఈ హర్రర్ సినిమాలో భయపెట్టే ఆత్మగా కూడా ప్రభాసే కనిపిస్తాడని అంటున్నారు.

Advertisement

Paan Masala: అనిల్ కపూర్ నుంచి అల్లు అర్జున్ వరకు.. యాడ్స్ వదులుకున్న సెలబ్రిటీస్ వీరే..!

అంటే.. పాత్రలు రెండే అయినా.. వారిద్దరిలో ఒకరు ఆత్మగా మరో గెటప్ లో కనిపిస్తాడని చెప్పుకొస్తున్నారు. తాత చనిపోయి.. ఆత్మగా మరో గెటప్ లో  మనవడికి సహాయం చేయడానికి వస్తాడని టాక్.  ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ పండగ అనే చెప్పాలి. ఇప్పటివరకు ప్రభాస్ ను ఒకే లుక్ లో చూసి చూసి ఉన్న ఫ్యాన్స్ కు ఈ సినిమా పెద్ద సర్ ప్రైజ్ అవుతుంది. వచ్చే ఏడాది రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో డార్లింగ్.. ప్రేక్షకులను  భయపెడతాడా.. ? లేదా.. ?అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×