BigTV English

Paan Masala: అనిల్ కపూర్ నుంచి అల్లు అర్జున్ వరకు.. యాడ్స్ వదులుకున్న సెలబ్రిటీస్ వీరే..!

Paan Masala: అనిల్ కపూర్ నుంచి అల్లు అర్జున్ వరకు.. యాడ్స్ వదులుకున్న సెలబ్రిటీస్ వీరే..!

Paan Masala.. సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు లేదా ప్రజలు ఎలా మారిపోయారు అంటే ఒక పేరు ఉన్న సెలబ్రిటీ.. ఏది చెబితే అదే నిజం అనేట్టుగా నమ్ముతున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి సెలబ్రిటీల విషయంలో ఇది చాలా వరకు నిజం అనే చెప్పాలి. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఏదైనా ఒక ఉత్పత్తి గురించి ప్రమోట్ చేస్తున్నారు అంటే.. అంత లేనిదే వీరు ప్రమోట్ చేస్తారా? అనే ఆలోచనకి వస్తున్నారు. అయితే సెలబ్రిటీలు మాత్రం ప్రజల ఆరోగ్య విషయాలపై దృష్టి సారించకుండా తమకు డబ్బు వస్తే చాలు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ మసాలా, గుట్కా, బీడీ, సిగరెట్, బీర్, ఆల్కహాల్ వంటివి ఆరోగ్యానికి ప్రమాదకరం అని తెలిసినా.. కొన్ని బడా వ్యాపార సంస్థలు హీరోలకు లేదా హీరోయిన్ లకు కోట్ల రూపాయల పారితోషకాన్ని వారికి ఆశ చూపించి వారి చేత వీటిని ప్రమోట్ చేయిస్తున్నారు. అయితే వీరు వాటి గురించి, ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ప్రమోట్ చేస్తూ చివరికి చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు.. అయితే ఇవన్నీ కాదని, తమకు డబ్బు ముఖ్యం కాదని ప్రజల ఆరోగ్యమే ప్రధానం అంటూ భావించి ప్రజల మేలుకోరి కొంతమంది సెలబ్రిటీలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పాన్ మసాలా బ్రాండ్ ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Sharukh khan) ను మొదలుకొని ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వరకు కూడా చాలామంది ఈ పాన్ మసాలా యాడ్ చేశారు. అయితే విమర్శలు కూడా ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఇలాంటి పాన్ మసాలా యాడ్ ను రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ కూడా లేకపోలేదు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..


పాన్ మసాలా యాడ్స్ ను తిరస్కరించిన సెలబ్రిటీస్..

అనిల్ కపూర్ (Anil Kapoor)..


ప్రముఖ బాలీవుడ్ నటుడైన ఈయనకి ఇటీవల పాన్ మసాలా ప్రకటన ఆఫర్ రాగా.. ఆయన తన అభిమానుల పట్ల బాధ్యతగా భావించి, ఆ ఒప్పందాన్ని కాస్త తిరస్కరించారు.

కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan)..

భూల్ భులైయా 3 నటుడికి అనేక పాన్ మసాలా, సుపారి వంటి ప్రకటనలు వచ్చాయని, ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ ప్రజల శ్రేయస్సు కోసమే తాను చేయలేదని చెప్పుకొచ్చారు.

జాన్ అబ్రహం (John Abraham)..

“మరణాన్ని నమ్మను.. ఎందుకంటే అది చాలా సూత్రప్రాయమైన విషయం” అంటూ జాన్ పంచుకున్నాడు. అంతే కాదు ఇటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించినందుకు ఇతర సెలబ్రిటీలను కూడా ఆయన విమర్శించారు.

యష్ (Yash)..

కేజీఎఫ్ సినిమాతో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న ఈయన పొగాకు బ్రాండ్ కోసం కోట్ల రూపాయల ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.

స్మృతి ఇరానీ (Smriti Irani)..

స్మృతి ఇరానీకి కూడా పాన్ మసాలా ప్రకటన భారీ మొత్తానికి ఆఫర్ వచ్చిందట. కానీ తాను మాత్రం హానికరమైన ఉత్పత్తులను ప్రోత్సహించనని ముఖం మీదే చెప్పేసిందని సమాచారం.

అల్లు అర్జున్ (Allu Arjun)..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అనేక పొగాకు ఉత్పత్తుల ఒప్పందాలతో కోట్లకు కోట్ల రూపాయల ఆఫర్ లభించింది. అయినా సరే బన్నీ వాటిని ప్రోత్సహించలేదు.ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు.

ఇలా మొత్తానికి అయితే వీరంతా కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. కోట్ల రూపాయలను వదిలేసుకున్నారని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×