BigTV English

Chiranjeevi : 28న చిరుకు అక్కినేని పురస్కారం… ఎవరి చేతుల మీదు గానో తెలుసా..?

Chiranjeevi : 28న చిరుకు అక్కినేని పురస్కారం… ఎవరి చేతుల మీదు గానో తెలుసా..?

Chiranjeevi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా మారి ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించి, మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్న చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలో స్వయంకృషితో నేడు స్టార్ హీరో గానే కాకుండా రూ.వేల కోట్ల ఆస్తికి అధిపతి అయిన మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో మందికి అభిమానమే కాదు ఆదర్శం కూడా. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు అక్కినేని అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar Rao) శత జయంతి వేడుకలలో భాగంగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ఈ ఏడాది అక్కినేని నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


చిరంజీవిని ఆహ్వానించిన నాగార్జున..

ఈ నేపథ్యంలోనే తాజాగా నాగార్జున.. మెగాస్టార్ చిరంజీవిని కలిసి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఈవెంట్ కి రావాలి అని , అక్కడ జాతీయ పురస్కారం స్వీకరించాలని ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అయితే అక్కినేని నాగార్జున.. చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లి సాగరంగా ఆహ్వానించడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. అక్టోబర్ 28వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు చాలా ఘనంగా జరగబోతున్నాయి. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముఖ్యఅతిథిగా రాబోతున్నారు.


60 ఏళ్లు దాటినా ఇంకా ఫిట్..

అంతేకాదు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగానే మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందించనున్నట్టు నాగార్జున స్పష్టం చేశారు. ఇక చిరంజీవితో నాగార్జున కలిసి ఈవెంట్లో అవార్డు అందుకోవడానికి రమ్మని ఆహ్వానించిన ఫోటోలు నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఏది ఏమైనా రోజురోజుకీ మెగాస్టార్ క్రేజ్ పెరిగిపోతోందని చెప్పవచ్చు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి , నాగార్జున ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 60 ఏళ్లు దాటినా ఇంకా ఫిట్ గా ఉండడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఈ వయసులో కూడా ఇద్దరూ యంగ్ గా, ఫిట్ గా కనిపించడమే కాదు అందాన్ని, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం నిజంగా ప్రశంసనీయమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అక్కినేని శత జయంతి వేడుకలలో అక్కినేని అభిమానులు మెగా అభిమానులు సందడి చేయబోతున్నట్లు సమాచారం.

అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు..

ఇక చిరంజీవి విషయానికి వస్తే.. విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మే నెలలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ సినిమా చిరంజీవి వల్లే పోస్ట్ పోన్ అయిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా చికెన్ గున్యాతో బాధపడుతున్నాయని సరైన సమయానికి షూటింగ్లో పాల్గొనలేకపోయారు. దీంతో వీఎఫ్ఎక్స్ కాస్త పెండింగ్ పడింది. దీనికి తోడు చిరంజీవి నటించిన కొన్ని సన్నివేశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాను వాయిదా వేశారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×