E-Paper
Advertisement

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?
Advertisement

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తమిళ్ లో సూర్యకు ఎంత ఫ్యాన్ బేస్ అయితే ఉందో అంతకుమించిన ఫ్యాన్ బేస్ ఆయనకు తెలుగులో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ విషయాన్నీ సూర్యనే ఒప్పుకున్నాడు నిన్నటికి నిన్న కంగువ ప్రెస్ మీట్ లో తెలుగువారి అభిమానానికి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఇక సూర్య  నుంచి ఒక పాన్ ఇండియా సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. అన్ని నార్మల్ సినిమాలు చేస్తున్నాడు అనుకుంటున్నా సమయంలో కంగువ సినిమాను అనౌన్స్ చేసి.. ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు కు తిప్పుకున్నాడు.

స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తుండగా.. అనిమల్ ఫేమ్ బాబీ డియోల్  విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే కంగువ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. సినిమా కోసం సూర్య ఎంతకైనా తెగిస్తాడు.. ఎలాంటి పాత్ర అయినా ప్రాణం పెట్టి చేస్తాడు. కంగువలో ఒక యోధుడుగా ఆయన నటన.. ఆ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అంటే ఆశ్చర్యం లేదు.

Advertisement

Kanguva First Review : “కంగువ” ఫస్ట్ రివ్యూ… మూవీ టాక్ ఏంటంటే?

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన సూర్య.. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని రాష్ట్రాలను కవర్ చేయడం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ముంబైలో గ్రీట్ అండ్ మీట్ చేసిన ఈ హీరో.. నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక ఇవన్నీ కాకుండా.. ఈ కోలీవుడ్ హీరో టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోలైన.. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి ఆశీర్వాదాలు అందుకోవాలని ఆరాటపడుతున్నాడు.

Advertisement

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వెళ్లి.. ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. అంతకు ముందే అక్కినేని నాగార్జునను సూర్య కలిసిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు మెగాస్టార్ ను కూడా సూర్య కలవబోతున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. విశ్వంభర సెట్ కు వెళ్లి మరీ సూర్య, చిరును కలవనున్నాడట. చిరును కలిసి ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడట. దీంతో సూర్యను తెలుగు అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Ka Movie: ట్రైలర్ బావుంది.. కానీ, కిరణ్ అబ్బవరంకే లక్ లేదు..?

మంచి మనసు ఉన్న వ్యక్తి సూర్య అంటూ ఫ్యాన్స్  కొనియాడుతున్నారు. ఒక విధంగా సూర్య చేసే పని.. అతని సినిమాకు హైప్ తీసుకొస్తుందనే చెప్పాలి. హీరోలందరిని కలిసి.. వారి ఫ్యాన్స్ ను కూడా తన సినిమాకు రప్పించే పనిలో పడ్డాడు సూర్య. ఏదిఏమైనా సూర్య బాగానే ప్లాన్ చేశాడు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.  మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×