E-Paper
Advertisement

Prabhas – Hombale Films : ప్రభాస్ “సలార్” ప్రొడక్షన్ హౌస్ భారీ డీల్… ఏకంగా మూడు సినిమాల ఎపిక్ ప్లాన్

Prabhas – Hombale Films : ప్రభాస్ “సలార్” ప్రొడక్షన్ హౌస్ భారీ డీల్… ఏకంగా మూడు సినిమాల ఎపిక్ ప్లాన్
Advertisement

Prabhas – Hombale Films : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas )తో సినిమాను నిర్మించాలని ఎంతోమంది నిర్మతలు కలలు కంటున్నారు. అయితే తాజాగా ‘సలార్’ (Salaar) ప్రొడక్షన్ హౌస్ ఏకంగా ఒకేసారి మూడు సినిమాలను ప్రభాస్ తో లైన్ లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసి ప్రభాస్ అభిమానులను సర్ప్రైజ్ చేసింది హోంబలే ఫిల్మ్స్ (Hombale Films).

ఈ ఏడాది మొదట్లోనే ‘కల్కి’ మూవీతో ప్రభాస్ (Prabhas)  ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిప్నో తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అవడానికి కారణమైన మూవీ ‘సలార్’. ‘ఆదిపురుష్’ మూవీతో అంతకంటే ముందు బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన సినిమాలేవి పెద్దగా ఆడకపోవడంతో పాటు ‘ఆదిపురుష్’ కూడా మెడిసికొట్టడంతో ఇక ప్రభాస్ పని అయిపోయినట్టేనా అనిపించే సిచువేషన్ ఎదురైంది. అలాంటి కష్ట కాలంలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ‘సలార్’ మూవీతో బయట పడేసాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి, ప్రభాస్ ను మళ్ళీ బాక్స్ ఆఫీసు కింగ్ గా నిలబెట్టింది. ఆ తర్వాత ప్రభాస్ ‘కల్కి’తో వచ్చి హిట్ కొట్టగా, ఇప్పుడు ఆయన చేతిలో ‘ది రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’ వంటి సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

ఇంత బిజీ షెడ్యూల్లో ప్రభాస్ ‘సలార్ 2’ (Salaar 2)ను ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ తో త్వరలోనే ‘సలార్ 2’ మూవీని పట్టాలెక్కించబోతున్నట్టుగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ మూవీతో పాటు మరో రెండు బిగ్ ప్రొజెక్ట్స్ ను చేపట్టబోతున్నట్టు వెల్లడించింది.

2026, 27, 28 సంవత్సరాల్లో ప్రభాస్ (Prabhas) తో కలిసి మూడు సినిమాలు చేయబోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ తో హోంబలే ఫిల్మ్స్ కు కుదిరిన ఈ ఎపిక్ డీల్ గురించే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక ఇప్పటికే ఒక్కో సినిమాకు 150 కోట్ల మేర  రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్ ఈ మూడు సినిమాలకు కలిపి దాదాపు 450 కోట్లకు పైగా పారితోషం తీసుకునే అవకాశం ఉందంటూ ఇప్పటినుంచే లెక్కలు ఇస్తున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement

మొత్తానికి హోంబలే ఫిల్మ్స్ తో రాబోయే మూడు సినిమాలకు రెబల్ స్టార్ (Prabhas) బిగ్ డీల్ కుదుర్చుకున్నట్టు వచ్చిన ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. ఇక ఈ మూడు సినిమాల్లో ఒకటి ‘సలార్ 2’ కాగా, ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న మరో రెండు సినిమాలను ఈ బ్యానర్ పై నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×