Redmi K80 Series : చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గ్జియోమీ త్వరలోనే Redmi K80 సిరీస్ ను ఆ దేశంలో లాంఛ్ చేయటానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నెల చివరలో ఈ మెుబైల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక లాంఛింగ్ డేట్ ను వెల్లడించని రెడ్‌మి జనరల్ మేనేజర్ వాంగ్ టెంగ్ రాబోయే K80 ప్రో గురించి కీ ఫీచర్స్ చెప్పేసి టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచేశారు.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ మెుబైల్స్ ను లాంఛ్ చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గ్జియోమీ తాజాగా Redmi K80 సిరీస్లో కొత్త మెుబైల్స్ ను తీసుకురానుంది. ఈ సిరీస్ లైనప్లో Redmi K80, Redmi K80 Pro మెుబైల్స్ త్వరలోనే లాంఛ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో AnTuTu స్కోర్ డౌయిన్ (చైనా TikTok)లో వాంగ్ టెంగ్ లైవ్ స్ట్రీమ్ లో ఈ మెుబైల్ ఫీచర్స్ ను స్పెషల్ గా వెల్లడించారు. అధునాతన క్వాల్కమ్ 8 డ్రగన్ ప్రాసెసర్ తో ఈ మెుబైల్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు డిస్ ప్లే సైతం అదిరిపోయేలా ఉంటుందని.. ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తాయని, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో రాబోతున్నాయని తెలుస్తోంది.
ALSO READ : వివో టైమ్ ఆగయా.. DSLR కెమెరా ఫీచర్స్ తో X200 సిరీస్ వచ్చేస్తుందోచ్
Redmi K80 Series Specifications –
ప్రాసెసర్ – Redmi K80 Pro మెబైల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్/ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్ సెట్ తో రాబోతుంది. ఇక Redmi K80లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC చిప్ సెట్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. Redmi K80 సిరీస్ మెుబైల్స్ Android 15 ఆధారిత HyperOS 2తో రాబోతుంది.
కెమెరా – ఇక Redmi K80 సిరీస్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చేస్తుంది. ఇందులో ప్రైమరీ లెన్స్, అల్ట్రా వైడ్, టెలిఫోటో లెన్స్ తో పాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం స్పెషల్ ఫ్రెంట్ కెమెరా సైతం ఉండనున్నట్లు తెలుస్తుంది.
డిస్‌ప్లే – Redmi K80 Pro 2K 120Hz మైక్రో కర్వ్డ్ OLED డిస్‌ప్లేతో వస్తుండగా.. Redmi K80 మెుబైల్ 1.5K 120Hz OLED డిస్‌ప్లేతో వస్తుంది. హై రిజల్యూషన్ తో డిస్ ప్లే రాబోతుందని తెలుస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ – Redmi K80 Pro 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. K80 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ – ఈ రెండు మెుబైల్స్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ తో రాబోతున్నాయి. ఇక ఈ సిరీస్ మెుబైల్స్ కెమెరా క్వాలిటీ, స్టోరేజ్ తో పాటు మిగిలిన ఫీచర్స్ పూర్తి స్థాయిలో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.