E-Paper
Advertisement

Prabhas Speech in Kalki 2898AD Event: ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ప్రభాస్.. స్పీచ్ ఏమన్నా ఉందా భయ్యా.. అదిరిపోయిందంతే! (వీడియో)

Prabhas Speech in Kalki 2898AD Event: ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ప్రభాస్.. స్పీచ్ ఏమన్నా ఉందా భయ్యా.. అదిరిపోయిందంతే! (వీడియో)
Advertisement

Actor Prabhas Speech in Kalki 2898 AD Event: ప్రభాస్.. ఈ పేరు వినగానే గూస్ బంప్స్ పక్కాగా రావాల్సిందే. ఆ పేరుకు అంతటి క్రేజ్ ఉంది మరి. సినిమా ఏదైనా, క్యారెక్టర్ ఎలాంటిదైనా తన మార్క్ అక్కడ ఉండాల్సిందే. ఈ పేరు ఎక్కడ విన్నా అభిమానుల గుండెల్లో గంట మోగాల్సిందే. మరి అంతటి స్టార్ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే ఎలా ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.

‘కల్కి 2898 ఏడీ’ (KALKI 2898 AD) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఎంతో గ్రాండ్ లెవెల్లో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందింది. ఇందులో ప్రభాస్ లుక్‌కి యావత్ సినీ ప్రపంచమే ఫిదా అయిపోయింది. హాలీవుడ్ రేంజ్ మార్వెల్స్ హీరోలా కనిపించిన ప్రభాస్ అందరి మనస్సులు దోచుకున్నాడు. నిజంగా ప్రభాస్‌ను ఇప్పటి వరకు అలాంటి లుక్‌లో ఎన్నడూ.. ఏ సినిమాలోనూ చూసుండరు.

Advertisement

దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ప్రభాస్ అభిమానులు థాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే తాజాగా ఈ మూవీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఈవెంట్‌లో ప్రభాస్ నడిపే వాహనాన్ని లాంచ్ చేశారు. అయితే ఆ వాహనానికి బుజ్జి అనే పేరును కూడా పెట్టారండోయ్. అందుకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అందులో ప్రభాస్ ఏమన్నా ఉన్నాడా.. అబ్బో అదిరిపోయాడంతే.

Also Read: బుజ్జితో భైరవ ఎంట్రీ.. హాలీవుడ్ సినిమా చూసినట్లుంది కదా

Advertisement

ఈ ఈవెంట్‌లో ప్రభాస్ ఆ వెహికల్‌ని తానే స్వయంగా నడుపుకుంటూ గ్రౌండ్‌లో చక్కర్లు కొట్టాడు. అనంతరం ఒక క్రేన్‌పై ప్రభాస్ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉంది. ఫుల్‌గా హంగామా.. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో టపాసులు ఇలా మొత్తం అదిరిపోయింది. ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్ తన మాటలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాడు. ‘‘హాయ్ డార్లింగ్స్.. బుజ్జి – భైరవ గ్లింప్స్ ఎలా ఉంది. ఎంజాయ్ చేశారా. అంటే ఈ ఈవెంట్‌కి తక్కువ మందిని తీసుకురావడానికి.. ఇలా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మీ సేఫ్టీ కోసమే.. అందరికీ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము.

ముఖ్యంగా చెప్పాలంటే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కమల్ హాసన్‌కు వంద దండాలు సార్. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసిన నేను అచ్చం కమల్ హాసన్ వేసుకున్న బట్టలు కావాలని మా అమ్మని అడిగాను. అలాంటి నేను ఇప్పుడు ఆయనతో నటించడం అంటే మామూలు విషయం కాదు. థాంక్యూ కమల్ సార్’’ అంటూ మరిన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: Manchu Lakshmi: బెంగుళూరు రేవ్ పార్టీ గురించి ప్రశ్న.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఫైర్ అయిన మంచు లక్ష్మీ

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×