BigTV English

Manchu Lakshmi Fired on Reporter: బెంగుళూరు రేవ్ పార్టీ గురించి ప్రశ్న.. ‘ఏం మాట్లాడుతున్నావ్’.. అంటూ ఫైర్ అయిన మంచు లక్ష్మీ

Manchu Lakshmi Fired on Reporter: బెంగుళూరు రేవ్ పార్టీ గురించి ప్రశ్న.. ‘ఏం మాట్లాడుతున్నావ్’.. అంటూ ఫైర్ అయిన మంచు లక్ష్మీ

Manchu Lakshmi Serious on Reporter about Bangalore Rave Party Question: కలక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో మంచక్క ట్రోల్స్ వలన మరింత పేరు తెచ్చుకుంది. అమెరికన్ ఇంగ్లీష్ తో మాట్లాడుతూ మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తూ ట్రోల్స్ కు స్టఫ్ అందిస్తూ ఉంటుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే నటిగా లక్ష్మీ వరుస సినిమాలు చేయకపోయినా.. మంచి సినిమాలనే ఎంచుకుంటూ ఉంటుంది.


తాజాగా ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం యక్షిణి. రాహుల్ విజయ్, వేదిక జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో మంచు లక్ష్మీ జ్వాల అనే పాత్రలో కనిపిస్తుంది. నేడు ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా రిపోర్టర్స్ తో చిత్ర బృందం ఇంటరాక్ట్ అయ్యింది. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు మంచు లక్ష్మీ సమాధానాలు చెప్పుకొచ్చింది.

కన్నప్ప సినిమాలో మీరెందుకు నటించలేదు.. మంచు విష్ణు వద్దు అన్నాడా.. ? అన్న ప్రశ్నకు అలాంటిదేమి లేదు. ఈ విషయమై విష్ణు నన్ను సంప్రదించలేదు. ఒకవేళ ఆ సినిమాలో నాకు ఇవ్వదగ్గ పాత్ర లేదేమో.. మంచు మనోజ్ కూడా పాత్ర ఇవ్వలేదుగా.. అందరం చేస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది. సినిమా చేస్తేనే సపోర్ట్ చేసినట్లు కాదుకదా” అని చెప్పుకొచ్చింది.


Also Read: Actress Kavitha: పెళ్లి తరువాత ఆ కండీషన్ పెట్టా.. పిల్లలు పుట్టి చనిపోవడం.. ఎమోషనల్ అయిన కవిత

ఇక ఈ మధ్య టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బెంగుళూరు రేవ్ పార్టీ గురించి మీ స్పందన ఏంటి అన్న ప్రశ్నకి మంచక్క ఫైర్ అయ్యింది. ” నేనేదో చాలాకాలం తరువాతసిరీస్ ప్రమోట్ చేయడానికి వస్తే నన్ను అడుగుతారు ఏంటి.. అసలు అదేంటో నాకు తెలియదు.. బయట గొడవ ఏంటి అనేది నాకు తెలియదు. ఇది సందర్భం కూడా కాదు. నన్ను అడుగుతారు.. నాకేం సంబంధం” అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఆ ఘటనతో తనకేం సంబంధం లేదని, వాళ్ల సమస్య వాళ్లే చూసుకుంటారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×