E-Paper
Advertisement

Travels Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి

Travels Bus Accidents: తెలుగు రాష్ట్రాల్లో  ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి
Advertisement

Travels Bus Accident in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదాలతో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో నిర్మల్‌ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఓ ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడి ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తుండగా.. బస్సు లోపల చిక్కుకున్న మరికొందరు ప్రయాణీకులను స్థానికులు బయటికి తీసి రక్షించారు. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. గాయపడిన వారిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక నిద్రమత్తా అనే కోణంలో విచారణ చేపట్టారు.

Advertisement

Also Read: నెల్లూరులో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే!!

కాగా.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై మస్కాస్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగే సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement

ఒకరు మాత్రం అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ట్రావెల్ బస్సు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా.. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే తరుణంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×