BigTV English

Prabhas: ప్రభాస్‌ ‘స్పిరిట్’ ఎప్పుడంటే.. సందీప్ రెడ్డి వంగా మూవీ అప్ డేట్..

Prabhas: ప్రభాస్‌ ‘స్పిరిట్’ ఎప్పుడంటే.. సందీప్ రెడ్డి వంగా మూవీ అప్ డేట్..

Prabhas: అర్జున్ రెడ్డి. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్. విజయ దేవరకొండకు ఎంత పాపులారిటీ వచ్చిందో.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఒక్క సినిమాతోనే బాలీవుడ్ కు ఎగబాకాడు. అర్జున్ రెడ్డి రిమేక్ తో అక్కడా హిట్ కొట్టాడు. ఇప్పుడు రణ్ బీర్ కపూర్ తో యానిమల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ మూవీ ప్రభాస్ తో. సినిమా పేరు స్పిరిట్. ఇప్పటికే ఈ విషయంపై ప్రకటన వచ్చినా.. లేటెస్ట్ గా స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోందనే దానిపై.. నిర్మాత భూషణ్ కుమార్ అప్‌డేట్‌ ఇచ్చేశారు.


‘‘ప్రస్తుతం సందీప్‌రెడ్డి ‘యానిమల్‌’ సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్‌ సినిమా ‘స్పిరిట్‌’ పనులు మొదలుపెడతారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్పిరిట్ గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత భూషణ్‌ కుమార్‌.

లేటెస్ట్ అప్ డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగా మంచి జీల్ ఉన్న డైరెక్టర్. అర్జున్ రెడ్డితో విజయ్ ను మాస్ హీరోగా చేశాడు. ఇప్పుడు పోలీస్ రోల్ లో ప్రభాస్ ఇమేజ్ ను మరింత పెంచేస్తారనడడంలో డౌటే అవసరం లేదు. ప్రస్తుతం ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’, ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్‌’, నాగ్‌ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్‌ కే’(Project K) చేస్తున్నాడు ప్రభాస్. ఈ ఏడాది చివర్లోనే సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ఖాకీ యూనిఫాం వేసుకోనున్నాడు. పోలీస్ ‘స్పిరిట్’ ని చాటనున్నాడు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×