BigTV English

Prabhu: కోలీవుడ్ న‌టుడు ప్ర‌భుకి అస్వ‌స్థ‌త‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌

Prabhu: కోలీవుడ్ న‌టుడు ప్ర‌భుకి అస్వ‌స్థ‌త‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌

Prabhu:రంగంతో అనుబంధం ఉన్న వారికి కోలీవుడ్‌కి చెందిన దివంగ‌త‌ సీనియ‌ర్ న‌టుడు శివాజీ గ‌ణేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారుల్లో ప్ర‌భు సినీ ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప‌లు చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తున్నారు. ఈ సీనియ‌ర్ స్టార్ ఘ‌ర్ష‌ణ‌, చంద్రముఖి వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. ఈయ‌న ఇప్పుడు చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్లో జాయిన్ కావ‌టంతో అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.


అస‌లేం జ‌రిగిందంటే ప్ర‌భు కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న్ని హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. లేజ‌ర్ ట్రీట్మెంట్‌తో కిడ్నీలోని రాళ్ల‌ను తీసేసిన‌ట్లు డాక్ట‌ర్స్ చెప్పారు. మ‌రో రెండు, మూడు రోజుల్లో ప్ర‌భుని హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామ‌ని డాక్ట‌ర్స్ తెలిపారు.

ఇక బాల న‌టుడిగానే కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌భు.. శివాజీ గ‌ణేష‌న్‌ను ఫాలో అవుతూ హీరోగా త‌మిళంలోనే ఎంట్రీ ఇచ్చి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. ఎన‌బై, తొంబై ద‌శ‌కాల్లో ప్ర‌భు హీరోగా ఓ వెలుగు వెలిగారు. త‌ర్వాత హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. డార్లింగ్‌లో ప్ర‌భాస్ తండ్రిగా న‌టించారు. ఇలా ప‌లు తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించారు. రీసెంట్‌గా ఆయ‌న వెండితెర‌పై క‌నిపించిన చిత్రం వారిసు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×