Pradeep Machiraju : ఆరోజు రాత్రి కోకాపేట్ పబ్ లో ఏం జరిగింది ప్రదీప్ (Pradeep Machiraju)? ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. గత రెండు రోజుల నుంచి యాంకర్ ప్రదీప్ ఎమ్మెల్యేతో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాడు అనే వార్త టాలీవుడ్ ను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇదంతా ఎక్కడ మొదలైంది? అసలు ఆ పబ్బు గొడవ ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి వీటికి సమాధానం ఏమిటంటే….
టాలీవుడ్ టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) కూడా ఒకరు. అతను హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు అంటే షో హిట్ అయ్యి తీరాల్సిందే. పెళ్లి అంటేనే ఆమడ దూరం పారిపోయే ఈ యాంకర్ ఏపీలో అధికార పార్టీకి చెందిన ఒక లేడీ ఎమ్మెల్యేతో ప్రేమాయణం సాగిస్తున్నాడు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతున్న వార్త. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ కలిసి ఓ పబ్ కి వెళ్లారని, అక్కడ పెద్ద గొడవ జరిగిందని ప్రచారం జరుగుతుంది. మరి ఆ పబ్ కథ ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే…
ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) గత రెండేళ్ల నుంచి సదరు ఎమ్మెల్యేతో ప్రేమ యవ్వారం నడిపిస్తున్నట్టుగా సమాచారం. అంటే ఆమె ఎమ్మెల్యే కాకముందే ఇదంతా మొదలైందని అంటున్నారు. మొత్తానికి ఈ యాంకర్ కం హీరో దాదాపు రెండేళ్ల నుంచి ఆమెతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడనేది టాక్. ఈ నేపథ్యంలోనే సైలెంట్ గా తమ రిలేషన్షిప్ ని కొనసాగిస్తున్న వీరిద్దరూ కలిసి కోకాపేట్ లో ఉన్న ఒక లగ్జరీ పబ్ కి వెళ్లారట. అక్కడ జరిగే పార్టీకి చడీచప్పుడు లేకుండా వీళ్ళిద్దరూ వెళ్లగా, అక్కడ జరిగిన గొడవతో అసలు విషయం బయట పడిందని తెలుస్తోంది.
పది రోజుల క్రితం హైదరాబాదులోని కోకాపేట్ ఏరియాలో ఉన్న లగ్జరీ పబ్ కు యాంకర్ ప్రదీప్ (Pradeep Machiraju) తన ప్రేయసి అయిన ఎమ్మెల్యే తో కలిసి వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇక్కడ సినిమా రేంజ్ లో ట్విస్ట్ ఒకటి జరిగిందట. అదే పబ్ లో ఎమ్మెల్యే మాజీ లవర్ కు సంబంధించిన మనుషులు ఉన్నారట. దీంతో ఇద్దరి మధ్య ఏదో విషయంలో మాటామాటా పెరిగి, అది కొట్టుకునే వరకు వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ గొడవ ఏకంగా ఎమ్మెల్యే గాయపడే వరకు వెళ్ళిందట. దీంతో ఈ విషయం బయటకు పొక్కకుండా చూసుకొని, ఆమెకు ప్రదీప్ హైదరాబాదులోనే సైలెంట్ గా చికిత్స చేయించాడట. కోలుకున్నాక తన నియోజకవర్గానికి వెళ్ళిపోయిందని అంటున్నారు.
అయితే ప్రదీప్ (Pradeep Machiraju) కు సదరు ఎమ్మెల్యే మాజీ లవర్ కు సంబంధించిన మనుషులకు మధ్య జరిగిన మాటల యుద్ధం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమలు, ఎఫైర్లు అన్నవి సర్వసాధారణమైన విషయం. చాలామంది పెళ్లి బాట పట్టే వరకు కూడా ఇలాంటి విషయాలను సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తారు. ప్రదీప్ కూడా అలాగే చేద్దాం అనుకున్నట్టున్నాడు… కానీ పాపం కోకాపేట్ పబ్ లో జరిగిన గొడవ అతని ప్రేమకు సంబంధించిన విషయాన్ని రచ్చకీడ్చింది అనుకుంటున్నారు.