తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుకు ముందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు, పార్టీ నేతలు సీఎంకు తమదైన స్టైల్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఒరిస్సాలోని పూరి సముద్ర తీరంలో పూరీ బీచ్ లో సైతిక శిల్పం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు సైతం సోషల్ మీడియాలో సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. రేవంత్ సీఎంగా తొలిసారి పుట్టిన రోజు జరుపుకుంటూ ఉండటంతో రేపు సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అన్న ఆసక్తినెలకొంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం అన్న సంగతి తెలిసిందే. సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రేవంత్ ఆ తరవాత అంచెలంచెలుగా ఎదిగి సీఎం స్థాయికి ఎదిగారు.
జడ్పీటీసీ తరవాత ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరవాత ఎంపీగా ఇప్పుడు ఏకంగా సీఎంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తరవాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను గద్దె దించడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ తన చురుకైన మాట తీరుతో, పనితనంతో కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరించి పీసీసీ పదవిని అందుకుతున్నారు. పీసీసీగా సైతం తమ మార్క్ చూపించిన రేవంత్ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించారు. దీంతో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటూ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో పాలిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.