BigTV English

Rinku Singh: ఐపీఎల్‌ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !

Rinku Singh: ఐపీఎల్‌ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !

Rinku Singh: ఐపీఎల్ 2025 ( IPL 2025 )వేలంలో ఫ్రాంచైజీలు కోటలో డబ్బులను చెల్లించాయి. సత్తా ఉన్న ఆటగాళ్లను ఏమాత్రం ఆలోచించకుండా రిటైన్ చేసుకున్నాయి. గత ఐపిఎల్ సీజన్ కు గాను రింకు సింగ్ ను ( Rinku Singh ) కోల్కత్తా నైట్ రైడర్స్ ( KKR ) 55 లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంది. ఇక వచ్చే సీజన్ కోసం ఏకంగా 13 కోట్ల రూపాయలను చెల్లించింది. నిజానికి 2018 సీజన్ నుంచి రింకు కేకేఆర్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. 2023 సంవత్సరంలో రింకు సింగ్ ( Rinku Singh ) తన ఆట తీరుతో ఈ స్థాయికి వచ్చాడు.


Also Read: South Africa vs India, 1st T20I: రేపటి నుంచే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

ఆ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తో ( GT) జరిగిన ఓ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సులు బాది కేకేఆర్ ( KKR) జట్టుకు విజయాన్ని అందించాడు రింకు సింగ్ ( Rinku Singh ). దీంతో ఒక్కసారిగా రింకు సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ సీజన్లో 149.52 స్ట్రైక్ రేటుతో 474 పరుగులు చేశాడు. 2023 ఐపీఎల్ లో తన ప్రదర్శనకు గాను రింకుకు జాతీయ జట్టు నుంచి ఆహ్వానం అందింది. అదే సంవత్సరం ఐర్లాండ్ పర్యటనతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు రింకు సింగ్ ( Rinku Singh ).


Rinku Singh buys luxurious bungalow in home town

Also Read: Virat Kohli: కోహ్లీ బర్త్‌డే…కొడుకు ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ

కాగా, నవంబర్ 8వ తేదీ నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ జరగనుంది. ఈ పర్యటన కోసం భారత జట్టు త్వరలో దుబాయ్ కి వెళ్లనుంది. సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలోని జట్టులో రింకు సింగ్ ( Rinku Singh ) కూడా చేరాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు రింకు తన కుటుంబంతో సహా ఓజోన్ సిటీలోని గోల్డెన్ ఎస్టేట్ ను కొనుగోలు చేశాడు. అనంతరం కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఈ ఇంటి ధర సుమారుగా 3.5 కోట్లు ఉంటుంది. ఇది నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లలో ఒకటిగా కావడం విశేషం.

రింకు సింగ్ క్రికెట్ లోకి రావడానికి ముందు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. సంపాదన సరిపోక చాలా కష్టాలు పడ్డాడు. ఓ కోచింగ్ సెంటర్ లో స్వీపర్ గా ఉద్యోగాన్ని కూడా చేశాడు. తన తండ్రి గ్యాస్ కంపెనీలో పని చేస్తూ ఉండేవాడు. తన తండ్రికి గ్యాస్ కంపెనీ ఇచ్చిన రెండు గదుల క్వార్టర్ లోనే వీరు ఉండేవారు. చిన్ననాటి నుంచి రింకుకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దీంతో రింకు క్రికెట్ పైన దృష్టి పెట్టాడు. ఉత్తరప్రదేశ్ అండర్-19, అండర్-23 జట్లకు ఆడాడు. 2014లో ఉత్తరప్రదేశ్ తరఫున మ్యాచులు ఆడి తన సత్తాను చాటాడు అప్పటినుంచి రింకు క్రికెట్ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు తన ఆటతీరుతో టీమిండియా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×