E-Paper
Advertisement

Pradeep Machiraju Missing: ప్రదీపూ.. ఓ ప్రదీపూ.. ఎక్కడికి వెళ్లిపోయావ్ ప్రదీపూ..?

Pradeep Machiraju Missing: ప్రదీపూ.. ఓ ప్రదీపూ.. ఎక్కడికి వెళ్లిపోయావ్ ప్రదీపూ..?
Advertisement

Anchor Pradeep Machiraju Not active from Past 10 Days: బుల్లితెరపై యాంకర్ అనే మాట వినిపిస్తే ఫీమేల్ లో చాలామంది పేర్లు వినిపిస్తాయేమో కానీ, మేల్ యాంకర్స్ లో వినిపించే మొట్ట మొదటి పేరు ప్రదీప్ మాచిరాజు. ఒకానొక సమయంలో టీవీ పెడితే ప్రదీప్ తప్ప ఎవరు కనిపించేవారు కాదంటే అతిశయోక్తి కాదు. ఈటీవీ నుంచి మా టీవీ వరకు.. ఇక ఓటిటీలో కూడా ప్రదీప్ దే రాజ్యం. ఇక అంతగా ఫేమస్ అయిన ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా మారాడు.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ప్రదీప్ మరో సినిమా ఊసు ఎత్తలేదు. సినిమా తరువాత నార్మల్ గానే యాంకరింగ్ చేస్తూ కాలం గడిపాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. గత కొన్నిరోజులుగా ప్రదీప్ సోషల్ మీడియాతో పాటు అన్ని యాక్టివిటీస్ కు దూరంగా ఉంటున్నాడు. ఎలాంటి ప్రోగ్రామ్స్ లోను కనిపించడం లేదు. చివరికి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేడు. ఇక చాలా రోజుల తరువాత ప్రదీప్.. తన ఇన్స్టాగ్రామ్ లో రెండు ఫోటోలు షేర్ చేయడంతో.. అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Also Read: Kalki 2898AD: అదేంటి.. నాగీ మావా.. ఎలక్షన్స్ గురించి అంత మాట అనేశావ్

సంధ్యా సమయంలో ప్రదీప్ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు. ఆలివ్ గ్రీన్ టీ షర్ట్, క్యాప్ తో కూల్ లుక్ లో అదరగొట్టాడు. ఇక ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఎక్కడకు వెళ్ళావ్ అన్నా.. ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు అని కొందరు. కొత్త సినిమా చేసే ఉద్దేశ్యం ఉందా లేదా అని ఇంకొందరు అడిగేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రదీప్ కొత్త సినిమాను ఓకే చేశాడని, దానికోసం బాడీని బిల్డ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందులా ప్రదీప్ లుక్ లేదు. లాంగ్ హెయిర్ తో.. ఫిట్ గా కనిపిస్తున్నాడు. మరి త్వరలోనే ప్రదీప్ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×