Big Stories

Samsung Galaxy F55 5G Launch: మే 17న లాంచ్ కానున్న సామ్‌సంగ్ F55 5G.. లెదర్ ఫినిషింగ్‌‌తో అదరగొడుతున్న లుక్..!

Samsung Galaxy F55 5G Launching on May 17th: సామ్‌సంగ్ ఎట్టకేలకు భారతదేశంలో గెలాక్సీ ఎఫ్ 55 5G లాంచ్‌ను నిర్థారించింది. మే 17న ఫోన్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ గత నెలలో చైనాలో ప్రవేశపెట్టిన Galaxy C55 స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఫోన్‌ను తీసుకొస్తుంది. Galaxy F55 5G స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 SoC, పెద్ద 5,000mAh బ్యాటరీ‌తో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌‌తో సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర తదితర వివరాలు గురించి తెలుసుకోండి.

- Advertisement -

Samsung తన బ్రాండ్ నుంచి Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో మే 17న విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ సేల్‌రకు రానుంది. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.30 వేల లోపే ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు . ఇది కాకుండా Samsung.com నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కోసం ల్యాండింగ్ పేజీ Flipkartలో లైవ్ అవుతుంది. ఈ ఫోన్ అప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. వేగన్ లెదర్ ఫినిషింగ్ ఇందులో కనిపించనుంది.

- Advertisement -

Also Read: BSNL 4G : TATA, BSNL మాస్టర్ ప్లాన్.. ఇక ఆ నెట్వర్క్‌ల పని అవుట్!

ఫోన్ ధరకు సంబంధించి ఇటీవల జరిగిన లీక్‌లో దాని బేస్ వేరియంట్ 8 GB RAM+ 128 GB స్టోరేజ్‌తో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీని ధర రూ. 26,999. 256 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 29,999గా ఉంది. అయితే ఫోన్ 12 GB RAM +256 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: 125W ఫాస్ట్ ఛార్జింగ్, 1 TB స్టోరేజ్‌తో మోటో కొత్త ఫోన్.. మే 16న లాంచ్!

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ Galaxy C55 రీబ్రాండెడ్ వెర్షన్ అయితే స్పెసిఫికేషన్‌లు కూడా దాదాపు ఒకే విధంగా ఉండవచ్చు. Galaxy C55 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,080×2,400 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. కంపెనీ ఫోన్‌లో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ Snapdragon 7 Gen 1 SoCని కలిగి ఉంది. ఇది బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ మాత్రమే ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News