BigTV English

Kalki 2898AD: అదేంటి.. నాగీ మావా.. ఎలక్షన్స్ గురించి అంత మాట అనేశావ్

Kalki 2898AD: అదేంటి.. నాగీ మావా.. ఎలక్షన్స్ గురించి అంత మాట అనేశావ్

Nag ashwin on AP elections(Tollywood news in telugu):

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి2898AD ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇంకా నిరాశ తప్పడం లేదు. అన్ని కుదిరి ఉంటే ఈపాటికి కల్కి రిలీజ్ అయ్యి రెండు రోజులు కూడా అయ్యేది. కొన్ని కారణాల వలన వాయిదా పడిన కల్కి జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక కల్కి సినిమాపై ఎన్నికల ప్రభావం పడింది.అదేంటి ఎన్నికలు మరో రెండు రోజుల్లోనే కదా.. దానికి, కల్కికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.. ? ఎన్నికల ప్రభావం అంటే రిలీజ్ కు కాదు.. కల్కి కోసం పనిచేసేవారికి అన్నమాట. అంటే ఎలక్షన్స్ కావడంతో టెక్నీషియన్స్ అందరూ ఓటు వేయడానికి ఏపీకి వెళ్లారు. ఈ విషయం నాగీనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

తాజాగా వైజయంతీ ఆఫీస్ లో నిర్మాత స్వప్న దత్, నాగీ మాట్లాడుకుంటున్న ఒక ఫోటోను స్వప్న షేర్ చేసింది. ఇందులో స్వప్న.. హైదరాబాద్ లో పనిచేసే గ్రాఫిక్ టీమ్ మొత్తం ఎలక్షన్స్ కోసం ఏపీకి వెళ్లారు అని నాగీ చెప్పగా.. స్వప్న.. ఎవరు గెలుస్తారంట నాగీ అని అడిగింది. దానికి సమాధానంగా నాగీ.. నాకెందుకండి.. నా షాట్ లు ఎప్పుడు వస్తాయో నాకు కావాలి గాని అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరి చర్చ నెట్టింట వైరల్ గా మారింది.


అదేంటి.. నాగీ మావా.. ఎలక్షన్స్ గురించి అంత మాట అనేశావ్ అని కొందరు. అంతేలా ఏపీ వెళ్ళినవాళ్ళు వెంటనే వస్తారని నమ్మకం లేక నాగీ భయపడుతున్నట్లు ఉన్నాడు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈసారైనా చెప్పిన టైమ్ కు రిలీజ్ చేయకపోతే ఫ్యాన్స్ పిచ్చెక్కిస్తారని భయపడుతున్నాడు అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×