Big Stories

Virat Kohli Vs Rilee Rossouw: పంజాబ్ కింగ్స్ బెంగళూరు మ్యాచ్.. న్యూటన్ థర్డ్ లా అప్లై చేసిన కోహ్లీ..!

Virat Kohli Vs Rilee Rossouw Celebrations: గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)పై 60 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ జట్టు నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చెందిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ రిలీ రోసోవ్ మధ్య సరదా యుద్ధం కనిపించింది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చేసి పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీనికి సమాధానంగా పంజాబ్ కింగ్స్ కూడా తామేమి తక్కువ కాదన్నట్టు తొలి అర్థభాగంలో రెచ్చిపోయి ఆడింది. కానీ చివరలో తడబడి వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్ రీలి రూసో రెచ్చిపోయి ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

- Advertisement -

ఇన్నింగ్స్ 8వ ఓవర్లో గ్రీన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రూసో తనదైన శైలిలో సంబురాలు జరుపుకున్నాడు. మోకాళ్ల మీద కూర్చోని గన్ ఫైరింగ్ చేస్తున్నట్లు చేశాడు. కానీ ఆ తర్వాత ఓవర్లో కరణ్ శర్మ బౌలింగ్‌‌లో సిక్స్ కొట్టి మంచి ఊపుమీదున్న రూసో అదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కానీ కింగ్ కోహ్లీ న్యూటన్ థర్డ్ లా ను అప్లై చేశాడు. రూసో అవుట్ అయ్యాక అతని సంబురాలకు ధీటుగా విరాట్ కోహ్లీ గన్ ఫైర్ చేస్తూ వికెట్ ను ఎంజాయ్ చేశాడు. దీంతో నెటిజన్లు విరాట్ కోహ్లీని ఫిజిక్స్ ప్రొఫెసర్ అనడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read: విరాట్ సెంచరీ మిస్ అయినా.. ఆర్సీబీ ఘన విజయం

విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్ అర్ధ సెంచరీల తర్వాత బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌ను 60 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్ బెర్త్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 47 బంతుల్లో 92 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 195.74. ఐపీఎల్ 2024లో 12 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 153.51 స్ట్రైక్ రేట్‌తో 634 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News