Pradeep Machiraju : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) లవ్ స్టోరీ గురించే చర్చ నడుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయం తెలిసి మరింత షాక్ అవుతున్నారు ఆయన అభిమానులు. అంటే ఇన్నాళ్ళూ ఆయన తన అభిమానులకు అబద్దాలు చెప్పారా? అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. అసలు ప్రదీప్ ఎక్కడ దొరికిపోయాడు? ఇలాంటి కామెంట్స్ విన్పించడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే..
మనకు టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ప్రభాస్ గుర్తొస్తారు. అలాగే బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రదీప్ మాచిరాజునే (Pradeep Machiraju). ఈ యంగ్ యాంకర్ ఇప్పుడు ఓ ఎమ్మెల్యే తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇన్నాళ్లు తను సింగిల్ అంటూ చెప్పుకొచ్చిన ఈ స్టార్ యాంకర్ ఎమ్మెల్యేతో ఎందుకు సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు? ఏళ్ల తరబడి రిలేషన్ షిప్ లో ఉన్న ఈ యాంకర్ ఎందుకు సింగిల్ అంటూ చెప్పుకొచ్చాడు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) గత రెండేళ్ల నుంచి సదరు ఎమ్మెల్యేతో రిలేషన్ లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యాంకర్ ఇప్పటిదాకా బుల్లితెరపై ఎన్నో షోలలో కనిపించాడు. హోస్ట్ గా అతనికున్న ప్రతిభ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొన్ని షోలలో ఆయన ఇతరులపై డబుల్ మీనింగ్ పంచులు వేస్తూ, ముఖ్యంగా రిలేషన్ షిప్ విషయంలో ఇరికించడం బుల్లితెరపై ఎన్నోసార్లు చూశాం మనం. అదే అతని విషయానికి వచ్చేసరికి తాను సింగిల్ అంటూ ఇప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పటిదాకా అంటే ఎమ్మెల్యేతో అతను రిలేషన్షిప్ లో ఉన్నాడు అని వార్త బయటకు వచ్చి వైరల్ అయ్యేదాకా.
ఇదివరకు పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) పెళ్లంటే ఓ నరకం అంటూ సూక్తులు కూడా చెప్పేవాడు. మరి ఆ సూక్తులు ఇప్పుడు ఏమయ్యాయి? సింగిల్ సింగిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చిన ఈ యాంకర్ ఇప్పుడు ఆమెతో ప్రేమాయణం విషయాన్ని ఎందుకు సీక్రెట్ గా మెయింటైన్ చేశాడు? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే ప్రదీప్ (Pradeep Machiraju) పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. షోలలో కనిపించినప్పుడు జెంటిల్మెన్ లా నటిస్తారు, కానీ ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడే వీళ్ళ అసలు స్వరూపం ఏంటో బయట పడుతుంది అంటూ ఫైర్ అవుతున్నారు.
అయినా ప్రేమించడం అనేది తప్పు కానప్పుడు ఇలా సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం దేనికో అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి. మరి యాంకర్ ప్రదీప్ మాచిరాజు సదరు ఎమ్మెల్యేతో ఉన్న రిలేషన్షిప్ గురించి తనకు తానుగా ఎప్పుడు బయట పెడతాడు? అసలు బయట పెడతాడా? ఈ రిలేషన్ కేవలం రిలేషన్ గానే మిగిలిపోతుందా? ఈ వార్తలన్నీ బయటకు వచ్చాక కూడా ప్రదీప్ (Pradeep Machiraju) తను సింగిల్ అనే స్టేటస్ ని అలాగే మెయింటైన్ చేస్తాడా? అనేది ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త చర్చకు దారి తీసింది.