BigTV English

HYD Restaurant Raids: కిచెన్‌లో బొద్దింకలు.. ఫ్రిజ్‌లో కుళ్లిన చికెన్, మటన్.. హైదరాబాద్ రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు

HYD Restaurant Raids: కిచెన్‌లో బొద్దింకలు.. ఫ్రిజ్‌లో కుళ్లిన చికెన్, మటన్.. హైదరాబాద్ రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు

HYD Restaurant Raids: ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి క్షణం తీరిక ఉండట్లేదు. కనీసం వండుకొని తినే తీరక కూడా చాలా మందికి ఉండదు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై ఆధారపడుతున్నారు. ఏదైనా తినాలనిపిస్తే చాలు ఠక్కున ఆర్డర్ పెట్టేస్తుంటారు. మరోవైపు సరదాగా వీకెండ్స్‌లో రెస్టారెంట్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. ఒకప్పుడు రెస్టారెంట్ అంటే చాలు ఎగిరి గంతేసేవాళ్లు.. కానీ ఇప్పుడు హెటల్స్‌‌‌కి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఈ బలహీనతను ఆసరగా చేసకుని పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రెస్టారెంట్లు కుళ్లిన చికెన్, నాసిరకం మసాలాలతో చికెన్ బిర్యానీ పేరును పాడు చేస్తున్నారు.


గత కొద్దిరోజులుగా హైదరాబాద్ హెటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పలు రెస్టారెంట్లలో కుళ్లిపోయిన కూరగాయలు, కిచెన్‌లో బొద్జింకలు, ఎలుకలు, ఫ్రిజ్‌లలో కుళ్లిపోయిన చికెన్, మటన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్ని హోటల్స్ సీజ్ చేస్తున్నా, హోటల్స్‌పై కొరడా ఝలిపిస్తున్నా.. కల్తీ ఫుడ్ తిని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా హోటల్స్ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

Also Read: రేపే సీఎం బ‌ర్త్ డే.. వినూత్న రీతిలో శుభాకాంక్ష‌లు చెప్పిన ఫిష‌రీస్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్!


తాజాగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్స్‌పై కొరడా ఝలిపిస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌లోని సంతోష్‌ నగర్‌లో పలు హోటల్స్‌పై దాడులు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. శ్రీరాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ హోటళ్లలో తనిఖీలు చేశారు. వాటితో పాటు మూసాపేట్‌లోని కృతుంగ రెస్టారెంట్‌లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు.

ఈ తనిఖీలలో కుళ్లిపోయిన కూరగాయలతో సిబ్బంది వంట చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. హోటల్స్ కిచెన్‌లో బొద్దింకలు ఉన్నట్లు తేల్చారు. దాంతో పాటు ఫంగస్ వచ్చిన అల్లం వంటలకు వాడుతున్నారని గుర్తించారు. గడువు దాటిన ఆహార పదార్ధాలు వాడటంతో.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×