E-Paper
Advertisement

Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ అప్పుడే తెలుగు హీరో తో ట్రై చేశాడు, అది జరుగుంటే వేరేలా ఉండేది

Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ అప్పుడే తెలుగు హీరో తో ట్రై చేశాడు, అది జరుగుంటే వేరేలా ఉండేది
Advertisement

Pradeep Ranganathan : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. వాళ్లలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. ప్రదీప్ రంగనాథన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రదీప్ తెరకెక్కించిన లవ్ టుడే సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో మనందరికీ తెలిసిందే. తమిళ్లో 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు డబ్బింగ్ చేశారు. అయితే తెలుగులో కూడా ఈ సినిమా మంచి సంచలనాలకు తెరతీసి అద్భుతమైన కలెక్షన్స్ ను వసూలు చేసింది. దిల్ రాజుకు ఈ సినిమా మంచి లాభాలను తీసుకొచ్చి పెట్టింది.

షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు

Advertisement

ఇక ప్రదీప్ విషయానికి వస్తే ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ ను స్టార్ట్ చేశాడు. చాలా చిన్న ఏజ్ లోని ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు ప్రదీప్. ప్రదీప్ చేసిన చాలా షార్ట్ ఫిలిమ్స్ కి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ప్రదీప్ హిట్ అందుకున్న లవ్ టుడే సినిమా కూడా ఒకప్పుడు ప్రదీప్ తీసిన షార్ట్ ఫిలిం నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిందే. ప్రదీప్ తీసిన షార్ట్ ఫిలిం అప్పట్లోనే మంచి వైరల్ గా మారింది. ఆ తర్వాత అదే కాన్సెప్ట్ ను సినిమాగా మలిచి ప్రేక్షకులకు అందించాడు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

కోమాలి తర్వాత తెలుగు హీరోతో

Advertisement

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన ప్రదీప్ కోమాలి సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. జయం రవి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా హిట్ సాధించిన తర్వాత ప్రదీప్ రంగనాథన్ తెలుగులో నానికి ఏదో కథని చెప్పారట. అయితే నానికి ఆ కథ అంతగా కనెక్ట్ అవ్వలేదు. నాని ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడుతూ “ప్రదీప్ రంగనాథన్ కి ఆ స్పార్క్ ఉంది.
కోమాలి తర్వాత, అతను నాకు ఏదో చెప్పాడు. నేను ఆ ఎనర్జీని ముందే చూసి ఉంటే, నేను అతని మొదటి సినిమాను నిర్మించేవాడిని. అతను నటుడిగా మారడానికి ముందే మేము ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించాము. ఇప్పుడు అతను గొప్పగా చేస్తున్నాడు మరియు నేను అతని పట్ల నిజంగా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ప్రదీప్ క్రౌడ్ హీరో అయిపోయాడు. న్యూ ఏజ్ ఎనర్జీ ఆ బిగ్ స్క్రీన్ కాంబినేషన్ అనేది ఎప్పుడూ చూడడానికి బాగుంటుంది అని నాని తెలిపాడు.

Also Read : Allu Arjun : కసి లేదు.. హర్డ్ వర్క్ లేదు.. మొత్తం డూపే… అల్లు అర్జున్ పరువు తీస్తున్న పోస్ట్ ఇదే

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×