Uppal Balu Marriage :ఉప్పల్ బాలు (Uppal Balu).. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న ఈయన..” హాయ్ ఫ్రెండ్స్, నమస్తే షాక్ అయ్యారా?” అంటూ ఇలా రోజుకొక వీడియోని షేర్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటీవలే అఘోరీ గురించి మాట్లాడుతూ చాలా ఫేమస్ అయిన ఉప్పల్ బాలు.. ఇప్పుడు అఘోరీ గురించి రోజుకొక వీడియో షేర్ చేస్తూ జనాలలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అటు అఘోరీ గురించి ఉప్పల్ బాలు మాట్లాడిన ప్రతి వీడియో కూడా భారీగా వైరల్ అవ్వడమే కాకుండా మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అటు ఈవెంట్స్ లో, షో లకి అటెండ్ అవుతూ మధ్యమధ్యలో యూట్యూబ్ ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో నిలిచే ఈయన, తాజాగా పెళ్లి గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆమెతో పెళ్లికి సిద్ధం అంటున్న ఉప్పల్ బాలు..
ఇకపోతే ఉప్పల్ బాలు పెళ్లి గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. కుంభమేళాలో చాలా ఫేమస్ అయిన మోనాలిసా(Monalisa ) గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఈమెను పెళ్లి చేసుకుంటావా..? ఇప్పటికిప్పుడు మోనాలిసా వచ్చి ఒక ప్రపోజల్ పెట్టి, బాలు నువ్వంటే నాకు చాలా ఇష్టం.. మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగితే నువ్వు పెళ్లి చేసుకుంటావా..? అని యాంకర్ అడగగా ఉప్పల్ బాలు ఊహించని సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇదే విషయంపై ఉప్పల్ బాలు మాట్లాడుతూ.. “తను ఒప్పుకుంటే నాకు ఓకే.. ఆ అమ్మాయి పెళ్లికి రెడీ అంటే నేనెందుకు కాదంటాను చెప్పు.. కష్టపడి పనిచేసి మాత్రమే తింటుంది.
ఎవరి మీద తాను ఆధారపడలేదు. అంత ఫేమస్ అయినా తను చేసే పని మాత్రం ఎక్కడ ఆపలేదు. కుంభమేళాలో వరుసగా మూడు రోజులపాటు క్రేజ్ అందుకుంది. దీన్ని క్యాష్ చేసుకొని డబ్బు సంపాదిద్దాం అని మాత్రం అనుకోలేదు. అందుకే తన వృత్తిని తాను చేసుకుంటే వుంటే అందరూ ఆమె పైనే పడ్డారు. ఇక ఇప్పుడు చేసేదేమీ లేక తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది.. అలాంటి అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు నో చెబుతాను.. వెంటనే ఆమెను కూర్చోబెట్టి మరీ మూడు ముళ్ళు వేస్తాను అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక ఉప్పల్ బాలు కామెంట్లకు యాంకర్ కూడా షాక్ అయిపోయింది అని చెప్పాలి
అఘోరీ పై ఊహించని కామెంట్లు చేసిన ఉప్పల్ బాలు..
అఘోరీ గురించి మాట్లాడుతూ.. అఘోరీని ఏ జైల్లో వేయాలో తెలియక పోలీసులు తికమక పడినప్పుడు.. నాకు నవ్వొచ్చింది. తనని ఏ జైల్లో కాదు.. ఎవరు లేని జైల్లో వేస్తే బాగుంటుంద. ఎంతమందిని తిట్టింది. ఎంతమందిని మోసం చేసింది. అసలది అఘోరేనే కాదు. దొంగ అఘోరీ. ఇప్పుడు మంత్రం వెయ్ ..ఓం భీమ్ అను.. వెంటనే బయటకు వస్తావ్.. అయినా నువ్వు జైలుకు పోతావు” అని అందరికీ తెలుసులే.. ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావంటూ మండిపడ్డాడు ఉప్పల్ బాలు.. అలా ఆ వీడియోలతో బాగా పాపులర్ అయిపోయారు.