BigTV English

Allu Arjun : కసి లేదు.. హర్డ్ వర్క్ లేదు.. మొత్తం డూపే… అల్లు అర్జున్ పరువు తీస్తున్న పోస్ట్ ఇదే

Allu Arjun : కసి లేదు.. హర్డ్ వర్క్ లేదు.. మొత్తం డూపే… అల్లు అర్జున్ పరువు తీస్తున్న పోస్ట్ ఇదే

Allu Arjun : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అల్లు అర్జున్. ఆర్య సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే అప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే కూడా ఈ సినిమా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ముఖ్యంగా ఆర్య క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేసిన విధానం చాలా మందికి విపరీతంగా నచ్చింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడు దొరికాడు అని మొదటి సినిమాతోనే అనిపించుకున్నాడు. అయితే కేవలం దర్శకుడు, హీరో అని మాత్రమే కాకుండా అల్లు అర్జున్ సుకుమార్ మధ్య అక్కడితోనే మంచి బాండింగ్ పెరిగింది. అల్లు అర్జున్ ఎంతమంది దర్శకులతో సినిమాలు చేసినా కూడా సుకుమార్ అంటే ఇప్పటికీ ప్రత్యేకమని చెబుతూ ఉంటారు.


పుష్పతో పాన్ ఇండియా గుర్తింపు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఆర్య 2 అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా అప్పుడు కమర్షియల్ గా ఊహించిన సక్సెస్ సాధించక పోయినా కూడా, ఇప్పటికీ చాలామందికి ఒక ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్పా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు. ఈ క్యారెక్టర్ సుకుమార్ డిజైన్ చేసిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, మేనరిజం ను చాలామంది పొలిటీషియన్స్, స్పోర్ట్స్ మెన్స్ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడితో ఈ సినిమాకి మరింత గుర్తింపు లభించింది. ఏకంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.


కసి లేదు.. హర్డ్ వర్క్ లేదు

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అభిమానులు ఎంతమంది అయితే ఉన్నారు, అదే స్థాయిలో ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో కంప్లీట్ వైరల్ గా మారింది. ఆ వీడియోలో పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్ జపాన్లో చేసే ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ చూసినప్పుడు చాలామంది బాగా కష్టపడ్డాడు అని ఆశ్చర్యపడ్డారు. అలానే చాలామంది దర్శకులు కూడా అల్లు అర్జున్ లో ఒక కసి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ వీడియో మొత్తం డూప్ తోనే షూటింగ్ జరిపినట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోను వైరల్ చేస్తూ చాలామంది అల్లు అర్జున్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ పోస్ట్ అల్లు అర్జున్ పరువు తీసింది అని చెప్పాలి.

Also Read : V.n Adithya: ఆ టాప్ డైరెక్టర్స్ అంతా కూడా ఒకప్పుడు విఎన్ ఆదిత్య దగ్గర పనిచేసిన వాళ్ళే

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×