BigTV English

Bindi-Headache: బొట్టు పెట్టుకోకుంటే తలనొప్పిగా అనిపిస్తుందా? ఎందుకో తెలుసుకోండి

Bindi-Headache: బొట్టు పెట్టుకోకుంటే తలనొప్పిగా అనిపిస్తుందా? ఎందుకో తెలుసుకోండి

Bindi-Headache: భారత సంసృతిలో బొట్టుకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. చాలా మంది ఆడవారు తమ నుదుటిపై కుంకుమ, బొట్టు తిలకం వంటివి పెట్టుకుంటారు. అంతేకాకుండా పెళ్లైన మహిళలు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారు. అయితే కొందరు బొట్టు పెట్టుకోకపోతే తలనొప్పి వస్తుందని చెబుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? బొట్టుకు తలనొప్పికి మధ్య కనెక్షన్ ఏంటనే దానిపై చాలా మందికి అనేక సందేహాలు వస్తాయి. ఈ విషయంపై సాంస్కృతికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


మానసిక కారణాలు
బొట్టు పెట్టుకోవడం అనేది చాలా మందికి అలవాటు. ఇది ఒక ఆచారంగా, గుర్తింపుగా ఉంటుంది. బొట్టు పెట్టుకోకపోతే, కొందరికి అసౌకర్యంగా, ఏదో తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ మానసిక ఒత్తిడి తలనొప్పికి కారణం కావచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు. మనసు ఆందోళన చెందితే, శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సైన్స్ ఏం చెబుతోందంటే?
నుదురు భాగంలో బొట్టు పెట్టే చోట ముఖ్యమైన నాడీ కేంద్రం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతం మెదడుతో సంబంధం కలిగి ఉంటుందట. బొట్టు పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో స్వల్ప ఒత్తిడి ఏర్పడి, రక్త ప్రసరణ మెరుగవుతుందని కొందరు నిపుణులు చెబుతారు. బొట్టు పెట్టుకోకపోతే, ఈ ప్రక్రియ జరగక, కొందరికి తలనొప్పి వచ్చే అవకాశం ఉందట. అయితే, ఈ విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. దీనికి అసలు కారణం ఎంటి అనేదానిపై ఇప్పటికీ చాలా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి.


కుంకుమ, పసుపు ప్రభావం
సాంప్రదాయంగా బొట్టు కోసం కుంకుమ, పసుపు వాడతారు. ఈ పదార్థాలు చర్మంపై చల్లని అనుభూతిని కలిగిస్తాయి. ఇవి నుదురు భాగంలో ఉండే సున్నితమైన చర్మాన్ని ఉత్తేజపరచి, ఒత్తిడిని తగ్గిస్తాయని కొందరు చెబుతారు. బొట్టు పెట్టుకోకపోతే, ఈ సహజ ప్రభావం లేక, తలనొప్పి వచ్చే అవకాశం ఉందని అంటారు. ఇదే నిజం అని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, ఇది కూడా తలనొప్పి రావడానికి ఒక కారణమై ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

లైఫ్ స్టయిల్
ఈ రోజుల్లో ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం లేకపోవడం వంటివి తలనొప్పికి సాధారణ కారణాలు. బొట్టు పెట్టుకోకపోవడం వల్ల తలనొప్పి వస్తుందని అనిపించినా, దానికి జీవనశైలి కూడా కారణం కావచ్చని మరి కొందరు చెబుతారు. రోజూ బొట్టు పెట్టుకునే అలవాటు ఉన్నవారు, ఒక రోజు బొట్టు పెట్టుకోకపోతే, ఏదో మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది. దీని వల్ల ఒత్తిడికి గురవుతారు. ఫలితంగా తలనొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: స్మార్ట్ వాచ్ పెట్టకుంటే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా?

నొప్పిని తగ్గించడం ఎలా?
బొట్టు పెట్టుకోకపోవడం వల్ల తలనొప్పి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నప్పటికీ
ఈ సమస్యను తగ్గించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒకే సమయంలో బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల నొప్పి రాకుండా జాగ్రత్త పడొచ్చట.అంతేకాకుండా తలనొప్పి రాకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం, సరైన సమయానికి నిద్రపోవడం వంటివి అలవాటు చేసుకోవాలి.

బొట్టు పెట్టుకునే పరిస్థితి లేనప్పుడు ఒత్తిడిని తగ్గించే యోగా లేదా ధ్యానం చేయడం మంచిది.ఒకవేళ తలనొప్పి తీవ్రంగా ఉంటే, డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×