BigTV English

Prema Velluva : మిక్కి జే మేయర్ మ్యాజిక్.. ప్రేమ వెల్లువ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది… మరోసారి లుక్కేయండి

Prema Velluva : మిక్కి జే మేయర్ మ్యాజిక్.. ప్రేమ వెల్లువ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది… మరోసారి లుక్కేయండి

Prema Velluva : హిట్ సిరీస్ లో హిట్ 3 తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ ని అందుకుంది. నాని సరిపోదా శనివారం తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో చేసిన సినిమా హిట్ 3. ఈ చిత్రంలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నానిని 100 కోట్ల క్లబ్లో చేర్చిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ సినిమా నుండి ప్రేమ వెల్లువ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. నాని శ్రీనిధి శెట్టి మధ్య లవ్ కెమిస్ట్రీని ఈ వీడియో సాంగ్ లో మనం చూడొచ్చు. ఈ మూవీ హిట్ అవడంలో సినిమా పాటలు కూడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. తాజాగా రిలీజ్ చేసిన ప్రేమ వెల్లువ వీడియో సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి..


ప్రేమ వెల్లువ  ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

నాని శైలేష్ కొలను కాంబోలో వచ్చిన హిట్ 3 మూవీ అంచనాలను మించి సక్సెస్ అందుకుంది. నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రంలో నుంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. ప్రేమ వెల్లువ పాట లిరికల్ వీడియో ఇప్పటికే రిలీజ్ అయ్యి యూట్యూబ్లో మంచి వ్యూస్ ని అందుకుంది. సిద్ద్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన ప్రేమ వెల్లువా పాటకు మిక్కీ జే మేయర్ స్వరపరిచారు. ఈ పాట ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. నాని మూవీ ఆల్బమ్స్లో లో ప్రేమ వెల్లువ హిట్ ఆల్బమ్ గా నిలిచింది. చాలా రోజుల తర్వాత మిక్కిజె మేయర్ ఓ మంచి మెలోడీ సాంగ్ ను ఫాన్స్ కు అందించారు. మరి ఈ ప్రేమ వెల్లువ పాట వీడియో సాంగ్ మీరు ఒకసారి చూసేయండి.


నాని కెరియర్ లో బిగెస్ట్ హిట్ ..

కోర్ట్ మూవీ తో సక్సెస్ ని అందుకున్న నాని హిట్ త్రీ మూవీతో మరోసారి సక్సెస్ ని అందుకున్నాడు. అటు హీరోగా ఇటు నిర్మాతగా రెండు వైపులా నాని బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన హిట్ 3 గత చిత్రాల లానే ప్రేక్షకుల్ని ఈ చిత్రంతోను సప్రైజ్ చేశారని చెప్పొచ్చు. క్రైమ్ థిల్లర్ మర్డర్ మిస్టరీ చేదించడంలో ఓ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ గా నాని నటనతో మెస్మరైజ్ చేశారు. గత చిత్రాలు అడవి శేషు విశ్వక్సేను, నటనను మించి నాని ఈ చిత్రంలో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం మెప్పించింది అని చెప్పొచ్చు. సైకో కిల్లర్స్ గ్యాంగ్ ను అంతమందించడానికి అర్జున్ సర్కార్ గా నాని తాండవం హిట్ 3. ఓ రెండు మర్డర్స్ ఒకే విధంగా చేసి దాన్ని రికార్డ్ చేసి ఓ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఒకే టైంలో దేశవ్యాప్తంగా ఇలాంటి సీరియల్ మర్డర్స్ వరుసగా జరుగుతూ ఉంటాయి. ఈ హత్యల ను అర్జున్ సర్కార్ ఎలా చేదించాడు. అసలు అర్జున్ సర్కార్ ఎందుకు అంత క్రూరంగా ఉంటాడు అనేది తెలియాలి అంటే  మనం థియేటర్కు వెళ్లి చూడాల్సిందే.అర్జున్ సర్కార్ గా నాని ఇప్పటికే 100 కోట్లకు పైగా వాసుల్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసారు. మున్ముందు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×