BigTV English

OTT Movies: మంచు కురిసిపోవడం అంటే ఇదే.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే అర్జెంటీనా వెబ్ సీరిస్

OTT Movies: మంచు కురిసిపోవడం అంటే ఇదే.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే అర్జెంటీనా వెబ్ సీరిస్

‘సింగిల్’ మూవీలో శ్రీవిష్ణు చెప్పిన.. ‘‘మంచు కురిసిపోవడం’’ డైలాగ్ ఏ స్థాయిలో చర్చనీయమైందో తెలిసిందే. అయితే, సినిమాలో ఆ డైలాగ్ డిలీట్ చేసినా.. జనాలు మాత్రం దాన్ని ఇంకా పిచ్చ పిచ్చగా వాడేస్తున్నారు. ఓ బూతును కవర్ చేస్తూ శ్రీవిష్ణు చెప్పిన ఈ డైలాగ్.. తాజాగా ఓటీటీలో రిలీజైన వెబ్ సీరిస్‌కు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే.. ఈ సీరిస్ అంతా మంచులోనే ఉంటుంది. ఆ మంచు ఎన్నో భయానక పరిస్థితులకు దారితీస్తుంది. మంచుతో మొదలై.. ఎలియెన్స్‌తో ఎండ్ అయ్యే ఈ సీరిస్ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ సెట్టర్. ఇంతకీ ఆ సీరిస్ పేరు ఏమిటీ? కథ ఏమిటీ?


గత వారం ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వెబ్ సీరిస్.. ‘ది ఎటర్నాట్’ (The Eternaut). ఇది అర్జెంటీనా సైన్స్ ఫిక్షన్ కామిక్ ఆధారంగా రూపొందిన టెలివిజన్ సిరీస్. హెక్టర్ జర్మన్ ఒస్టర్‌హెల్డ్ రాసిన ఈ కథ‌ను ఫ్రాన్సిస్కో సోలానో లోపెజ్ కామిక్‌గా రూపొందించారు. దాన్నే ఇప్పుడు.. ఈ సిరీస్‌గా విడుదల చేశారు.
ఇక కథలోకి వెళ్తే.. బ్యూనస్ ఎయిర్స్‌ నగరంలో విషపూరిత మంచు కురవడం వల్ల మిలియన్ల మంది మరణిస్తారు. అయితే జువాన్ సాల్వో అనే వ్యక్తి అతని స్నేహితులు మాత్రం ఈ విపత్తును ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో వారు కొన్ని భయానక పరిస్థితులు ఎదుర్కొంటారు.

అలా మొదలవుతుంది…


అది వేసవి కాలం. బ్యూనస్ ఎయిర్స్ నగరంలో కార్లా అనే యువతి తన స్నేహితులతో ఓ పడవలో విహారానికి వెళ్తుంది. వాళ్లంతా సముద్రం మధ్యలో ఉన్నప్పుడు సిటీలో లైట్లన్నీ ఆరిపోతాయి. చుట్టూ చీకటి.. అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఇంతలో కార్ల పడవ లోపలికి వెళ్తుంది. బయట శబ్దం ఏమిటా అని చూస్తే.. తన స్నేహితురాలు ఊపిరి ఆడక చనిపోవడం చూస్తుంది. అక్కడితో అసలు కథ మొదలవుతుంది. కార్లా సీన్ తర్వాత.. కథ నేరుగా.. నగరంలోకి వెళ్తుంది.

బ్యూనస్ ఎయిర్స్ నగరంలో జువాన్ సాల్వో (రికార్డో డారిన్) తన స్నేహితులతో పేకాడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారే చల్లబడిపోతుంది. అకస్మాత్తుగా మంచు కురవడం ప్రారంభమవుతుంది. ఈ మంచు సాధారణమైనది కాదు.. విషపూరితమైనది. దాన్ని పీల్చినవారు వెంటనే చనిపోతారు. బ్యూనస్ ఎయిర్స్‌లో మంచు చాలా అరుదుగా పడుతుంది. దీంతో ఈ సంఘటన నగరవాసులను భయాందోళనకు గురిచేస్తుంది. జువాన్, అతని స్నేహితులు, ఫవాళ్ళి, లూకాస్, ఓమర్ పేకాడుతూ ఆ ఇంట్లోనే ఉండటం వల్ల విపత్తు నుండి బయటపడతారు. అయితే, వారిలో ఒక స్నేహితుడు మాత్రం మాట వినకుండా బయటకు వెళ్లి మంచు గాలిని పీల్చి చనిపోతాడు.

అయితే, జువాన్‌ తన భార్య ఎలెనా, కూతురు క్లారా ఎలా ఉన్నారో అని కలత చెందుతాడు. జువాన్ తన కూతురిని కనుగొనేందుకు, విషపూరిత మంచులోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకు వాటర్‌ప్రూఫ్ దుస్తులు, గ్యాస్ మాస్క్‌లను ఉపయోగిస్తాడు. లక్కీగా ఆ ట్రిక్ పనికొస్తుంది. జువాన్‌కు ఏమీ కాదు. ముందుగా అతడు తన భార్య ఎలెనాకు కలుస్తాడు. ఆమెతో కలిసి తన కూతురు కోసం వెతకడం ప్రారంభిస్తాడు.

మరో బిగ్ ట్విస్ట్…

అలా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత.. ఈ మంచు కేవలం సహజ విపత్తు కాదని, ఏలియన్స్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని జువాన్, అతని స్నేహితులు తెలుసుకుంటారు. ఏలియన్స్ భారీ కీటకాల్లా ఉంటాయి. అవి మనుషులపై దాడి చేస్తాయి. అంతేకాకుండా అవి కార్లను, బస్సులను అడ్డుగా పెట్టుకుని ఒక గోడను నిర్మించుకుంటాయి. అక్కడే గూళ్లు పెట్టుకుని నివసిస్తాయి. మరో ట్విస్ట్ ఏమిటంటే.. అవి మనుషులను బంధించి వశం చేసుకుంటాయి. అయితే, ఆ కీటకాలకు ఓ గ్రహాంతరవాసి బాస్. సీరిస్ చివర్లో ఒక పెద్ద చేతిని చూపిస్తారు. అది మనుషులను నియంత్రిస్తూ ఉండటం చూపిస్తాడు. అది ఏం చెబితే మనుషులు అది చేస్తుంటారు. చివరికి జువాన్ కూతురు కార్లా కూడా ఆ గ్రహాంతరవాసి కనుసన్నల్లో పనిచేస్తుంది.

Also Read: పశువుల డాక్టర్ గా బాసిల్ జోసెఫ్.. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

చివరికి ఏమవుతుందో తెలియాలి అంటే.. రెండో సీజన్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే. ఈ సీరిస్ ఇప్పుడు Netflixలో అందుబాటులో ఉంది. మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇది అస్సలు బోరు కొట్టదు. కొన్ని సీన్లు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. బ్రూనో స్టాగ్నారో దర్శకత్వం వహించిన ఈ సీరిస్‌లో రికార్డో డారిన్, కార్లా పీటర్సన్, సీజర్ ట్రోంకోసో, ఆండ్రియా పీట్రా కీలక పాత్రలు పోషించారు. 2వ సీజన్ 8 ఎపిసోడ్‌లతో తెరకెక్కించినట్లు సమాచారం. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×