BigTV English

Balakrishna vs Chiranjeevi : చిరుపై బాలయ్య రివేంజ్ ప్లాన్ చేస్తున్నాడా..?

Balakrishna vs Chiranjeevi : చిరుపై బాలయ్య రివేంజ్ ప్లాన్ చేస్తున్నాడా..?

Balakrishna vs Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జున ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్నారు. అంతే కాదు… వీరి మధ్య పోటీ కూడా ఉంటుంది. గతంలో 2023 సంక్రాంతికి చిరంజీవి – బాలయ్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఆ పోటీలో బాలయ్య కాస్త వెనకబడ్డాడు. ఇప్పుడు ఆ రీవెంజ్ తీసుకోవడానికి బాలయ్య ఇప్పుడు రెడీ అవుతున్నట్టు సమాచారం అందుతుంది.


చిరంజీవి – బాలకృష్ణ ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద దాదాపు 20 సార్లు పోటీ పడ్డారు. చివరి సారిగా.. 2023 సంక్రాంతికి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు సై అంటే సై అంటూ పోటీకి దిగారు.

వాల్తేరు వీరయ్య మూవీతో చిరంజీవి, వీర సింహ రెడ్డి మూవీతో బాలకృష్ణ 2023 సంక్రాంతికి వచ్చారు. ఈ రెండు సినిమాలను ఆడియన్స్ బాగానే ఆదరించారు. కానీ, పోటీ, ఎవరు గెలిచారు లాంటి విషయాలను ప్రస్తావిస్తే మాత్రం వాల్తేరు వీరయ్య తో పోలిస్తే వీర సింహారెడ్డి కాస్త వెనకబడింది అని తెలిసిపోయింది.


అయితే ఆ రీవెంజ్ ను తీర్చుకోవడానికి నందమూరి బాలకృష్ణ ఓ భారీ సినిమాతో చిరుకు పోటీగా దిగబోతున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి ప్రస్తుతం విశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. అది ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరు సినిమా ఉంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడే సంక్రాంతికి రీలిజ్ చేయబోతున్నట్టు చెప్పారు. అందు కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి చక చక పనులు చేసుకుంటున్నాడు. చిరు కూడా ఒకే సారి బల్క్ డేట్స్ ఇచ్చాడు. ఇదింతా చూస్తే చిరు – అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతికి రావడం ఫిక్స్ అయినట్టే.

ఇదిలా ఉంటే… బాలయ్య కూడా సంక్రాంతిపైన కన్ను వేసినట్టు తెలుస్తుంది. బాలయ్య ప్రస్తుతం బాగా కలిసొచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ మూవీకి సీక్వెల్ అఖండ 2 చేస్తున్నాడు. ఈ మూవీని సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారట.

ఈ రెండు సినిమాలు 2026 సంక్రాంతి పోటీలో ఉంటే బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఉండటం ఖాయం అని చెప్పొచ్చు. చిరంజీవి లాంటి సీనియర్ హీరో.. అపజయమే లేని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తోడవ్వడం చాలా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. పైగా… 2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి ఓ సాలిడ్ హిట్ కొట్టి సూపర్ ఫాంలో ఉన్నాడు.

అటు బాలయ్య సైడ్ కూడా విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువే ఉంది. బోయపాటి – బాలయ్య కాంబోలో వచ్చిన ఏ సినిమా కూడా ఆడియన్స్ ను నిరాశపర్చలేదు. అందులోనూ అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కాబట్టి… అంతకు మించిన లెక్క ఉంటుంది. ఇప్పటికు బోయపాటి కుంభమేళలో ఓ నాగ సాధువులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశాడు. అది సినిమాకే హైలైట్ గా ఉంటుందట.

దీనికి తోడు బోయపాటి సినిమా అంటే.. బాలయ్యకు పడే మాస్ ఎలివేషన్స్ కు కరవు ఉండదు. ఇది బాలయ్య అభిమానులకే కాదు… యాక్షన్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఓ ఫిస్ట్ అనే చెప్పొచ్చు.

ఇవేవీ చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో ఉండలేవు. అయితే… ఈ సినిమాలో కామెడీకి కొదువ ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెగాస్టార్ గ్రేస్ అండ్ కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×