BigTV English

Actress Kalpika :ప్రిజం పబ్‌లో వీరంగం.. హీరోయిన్ కల్పికకు గట్టి షాక్ ఇచ్చిన పోలీసులు… ఇక బయటకు రావడం కష్టమే ?

Actress Kalpika :ప్రిజం పబ్‌లో వీరంగం.. హీరోయిన్ కల్పికకు గట్టి షాక్ ఇచ్చిన పోలీసులు… ఇక బయటకు రావడం కష్టమే ?

Actress Kalpika : టాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి కల్పిక.. ఈమె పేరు ఈమధ్య వార్తల్లో తెగ మారుమోగిపోతుంది. ఇటీవల తన బర్త్ డే సందర్బంగా ఓ పబ్ కు వెళ్లిన కల్పికకు, పబ్ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి వరకు వారు అక్కడ వేడుకలను జరుపుకొంటూ ఎంజాయ్ చేశారు. పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో కల్పిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో వారి మధ్య గొడవకు దారి తీసింది. ఆ క్రమంలో ఆ వాగ్వాదాన్ని ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్ చేసింది. పోలీసులు ముందే హంగామా చేసింది. పబ్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఆమె పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. పలు సెక్షన్ల కింద ఆమె కేసును నమోదు చేశారు పోలీసులు..


సినీనటి కల్పికపై కేసు నమోదు..

గత నెల 29 న తన పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కి ఆమె వెళ్ళింది. అయితే అక్కడ కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో గొడవకు దిగింది. అనంతరం పబ్ తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఒక లైవ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నించినందుకు గాను, అలాగే బిల్ చెల్లింపులో వాగ్వాదం జరగడం ఈ గొడవకు, దాడికి కారణం. గంటన్నర సేపు పబ్ యాజమాన్యంతో నాకు గొడవ జరిగింది. నేను చేసిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. పబ్ యాజమాన్యం పట్ల పోలీసులు ఉదారంగా వ్యవహరించారు. వారు గొడవను చూస్తూ ఆడియెన్స్‌ మారిగా చూస్తూ నిలుచున్నారు. దాంతో గచ్చిబౌలి పోలీసుల తీరు చూసిన తర్వాత ఈ గొడవలో నాకు న్యాయం జరుగుతుందని అనిపించలేదు అని కల్పిక చెప్పింది.. పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.


అయితే ఈ గొడవ జరిగిన ఎన్ని రోజుల తర్వాత ఈమెపై పోలీస్ కేసు నమోదయింది. ప్రిజం పబ్ యాజమాన్యం బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేశారు. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరి కల్పికను అరెస్టు చేస్తారా? ఈ సెక్షన్ల వల్ల ఆమె బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏం జరుగుతుందనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది.

Also Read :ఓడియమ్మ.. నార్త్ లో ఓన్లీ టీజర్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేశారా..?

నటి కల్పిక సినిమాలు.. 

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలోకి రావాలనే కోరికకతో ఇటుగా అడుగులు వేశారు. మోడలింగ్ నుండి తన సినీ ప్రయాణం ప్రారంభించి, 2009లో ప్రయాణం సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. ఆమె చేసిన కొన్ని ప్రధాన సినిమాలు.. సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడి పడి లేచె మనసు, సీత ఆన్ ది రోడ్, యశోద వంటి సినిమాల్లో నటించింది.. ఇప్పటివరకు ఆమె నటించిన ప్రతి సినిమా ఆమె నటనకు మంచి మార్కులు పడేలా చేశాయి. ప్రస్తుతం వు రెండు ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం. అయితే సోషల్ మీడియాలో పబ్ దాడి తర్వాత ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆమెపై కేసు నమోదు అవ్వడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై కల్పిక ఎలా స్పందిస్తారో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×