Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లోకి వస్తూ కిందపడబోయిన మిస్సమ్మను ఆరు పట్టుకుంటుంది. ఆరును చూసిన మిస్సమ్మ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే ఆరును హగ్ చేసుకుంటుంది. దూరం నుంచి గమనిస్తున్న చిత్ర, మను షాక్ అవుతారు. ఇంతలో మిస్సమ్మ కోపంగా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. అర్జెంట్ పని ఉండి వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చిందని ఆరు చెప్తుంది. అయితే సరేలే అక్కా మీకు ఒకరిని పరిచయం చేస్తాను రండి అంటూ మను, చిత్రల దగ్గరకు తీసుకెళ్తుంది మిస్సమ్మ. చిత్ర భయం భయంగా చూస్తుంటుంది. అక్కా ఈ అమ్మాయి తెలుసా..? నీకు అని అడుగుతుంది.
దీంతో ఆరు నాకెందుకు తెలియదు చిత్ర కదా..? అంటుంది. చిత్ర నీకెలా తెలుసు అక్కా అని మిస్సమ్మ అడగ్గానే.. అరుంధతి గారికి మనోహరి గారి చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా అలా తెలుసు అంటూ కవర్ చేస్తుంది. ఇంతలో చిత్ర ఆవిడ ఏమంటన్నారు అని కంగారుగా అడుగుతుంది. ఏ నువ్వు వినలేదా..? అని మిస్సమ్మ అడుగుతుంది. నాకు కొంచెం వినబడలేదు అంటుంది చిత్ర. ఓ బ్రెయిన్‌తో పాటు చెవులు కూడా పని చేయడం లేదన్నమాట అంటూ ఆరు అక్కకు మనోహరి గారు క్లోజ్ ఫ్రెండ్ కదా నాకెందుకు తెలియదు అంటున్నారు. చిత్ర ఈవిడ పక్కింటావిడ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటూ మిస్సమ్మ పరిచయం చేస్తుంది. చిత్ర అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు హాయ్ చెప్పు అంటుంది. చిత్ర కంగారుగా అటూ ఇటూ చూస్తుంటే.. సరేలే అక్కా మీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ ఆరును తీసుకుని పైకి వెళ్తుంది మిస్సమ్మ. ఇద్దరూ కలిసి చిత్ర, వినోద్ ల పెళ్లి జరగకుండా చేయాలని ప్లాన్ చేస్తారు.
మరోవైపు రూంలోకి వెళ్లిన మనోహరి, చిత్ర ఇద్దరూ కలిసి స్వామిజీకి కాల్ చేస్తారు. స్వామిజీ ఏంటి మనోహరి నువ్వు చెప్పేది.. నిజమా..? ఆత్మ మళ్లీ తిరిగి ఇంటికి వచ్చిందా..? అని అడుగుతాడు. దీంతో చిత్ర రావడమే కాదు నాతో పరిచయం చేసుకునేదాకా వచ్చింది అని చెప్తుంది. మనోహరి కూడా ఏదో జరుగుతుంది స్వామిజీ అదేదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది అంటుంది. చిత్ర కూడా నా పెళ్లి చెడగొట్టేస్తుంది స్వామిజీ ఏదో ఒకటి చేయండి అంటుంది. స్వామిజీ ఆశ్చర్యంగా ఇవాళ ఆత్మ పరమాత్మలో కలిపిపోవాలి మనోహరి. అలా జరగలేదు అంటే కచ్చితంగా ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. దైవ కార్యానికి సైతం ఆటంకం కలిగించింది అంటే ఆ ఇంట్లో ఏదో పెద్ద విషయమే జరిగింది. అదేంటో తెలిస్తేనే సమస్య తెలుస్తుంది. సమాధానం కనిపెట్టవచ్చు అని చెప్తాడు స్వామిజీ. దీంతో చిత్ర ఇంట్లో పొద్దుటి నుంచి పూజ తప్పా ఇంకేమీ జరగలేదు స్వామి అని చెప్తుంది.
ఏం పూజ జరిగిందని స్వామిజీ అడగ్గానే.. అరుంధతి పూజల పిచ్చిది స్వామిజీ ఈ నెలలో వచ్చే పౌర్ణమికి శివుడి పూజ చేస్తే మంచిదని రకరకాల పూజలు చేసేది అని మనోహరి చెప్తుంది. అసలు ఏం పూజలు చేశారు. ఎలాంటి పూజలు చేశారు అని స్వామిజీ అడుగుతాడు. పూజ గురించి మొత్తం చెప్తుంది మనోహరి. దీంతో స్వామిజీ నేలపురింజలతో పూజ చేశారా..? పరమేశ్వరా అంటాడు. దీంతో చిత్ర భయంతో ఏమైంది పంతులు గారు ప్రాబ్లమ్ అంతా ఆ పువ్వులతోనే వచ్చిందా అని అడుగుతుంది. ఆ పువ్వులు దేవుడి దగ్గర కాకుండా మరెక్కడైనా పెట్టారా..? అని అడుగుతాడు. పిల్లలు తీసుకెళ్లి ఆరు ఫోటో దగ్గర పెట్టారు అని మనోహరి చెప్పగానే.. స్వామిజీ తప్పు జరిగిపోయింది మనోహరి.. ఆ పువ్వులు అక్కడ పెట్టినందుకే ఆత్మ తిరిగి వచ్చింది అని చెప్తాడు. వెంటనే ఆ పువ్వులు అక్కడి నుంచి తీసేయండి అని చెప్తాడు.
సరేనని మనోహరి చిత్రను రెచ్చగొట్టి వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టేలా చేయమని అంటుంది. చిత్ర సరే అంటుంది. వినోద్‌ను తొందర పెడుతుంది చిత్ర. దీంతో అందరూ కలిసి పంతులును పిలిపించి ముహూర్తం పెట్టిస్తారు. పంతులు రెండు రోజుల్లో ముహూర్తం ఉందని చెప్తాడు. అప్పుడు అమర్ చిత్ర నీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు అని అడుగుతాడు. దీంతో చిత్ర నాకు ఆశ్రమంలో వాళ్లు తప్పా ఇంకెవరు ఉన్నారు బావగారు అని చెప్తుంది. దీంతో అమర్ అదేంటి నిన్ను దత్తత తీసుకున్న ఫ్యామిలీని నువ్వు పిలవడం లేదా అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. దత్తత తీసుకున్నవాళ్లా..? అంటే ఏంటి అని మిస్సమ్మ అడుగుతుంది. చిత్రను ఒక కుటుంబం దత్తత తీసుకుంది అని అమర్ చెప్పగానే వినోద్ కోపంగా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా చిత్రను దత్తత తీసుకోవడం ఏంటి..? చిత్ర మా అన్నయ్య చెప్తుంది నిజమా అని అడగ్గానే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?