Akhanda 2 : నందమూరి స్టార్ హీరో నరసింహం బాలయ్య ఇటీవల డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు ఏడాది మరో సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో మూడు సినిమాలు చేశారు. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ప్రస్తుతం ఆయనతోనే నాలుగో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో అఖండ 2 రాబోతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ అయింది. భారీ యాక్షన్ సీక్వెల్ గా రాబోతుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతుంది. ఈ టీజర్ ప్రమోషన్స్ కోసం నార్త్ లో భారీగా ఖర్చు చేసినట్లు ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. మరి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు కాస్త వివరంగా తెలుసుకుందాం..
“అఖండ 2” టీజర్ కు మాస్ రెస్పాన్స్..
బాలయ్య ప్రస్తుతం చేస్తున్న మూవీ అఖండ 2 నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఒకవైపు వర్గాన్ని టీజర్ బాగా ఆకట్టుకుంటే.. మరోవైపు ఈ టీజర్ లోని బాలయ్య గెటప్ పై మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ టీజర్ లో బాలయ్య చెప్పిన “నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా?” వంటి డైలాగులు అభిమానుల్లో పుల్ ఎనర్జీకి కారణమవుతున్నాయి.. యూట్యూబ్ లో భారీగా వ్యూస్ ని రాబడుతుంది. కేవలం 24 గంటల్లోనే 24 మిలియన్ల వ్యూస్ ని రాబట్టిందంటే మామూలు విషయం కాదు. విజువల్స్ తో పాటు తమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ ఎలా కనిపిస్తుంది.
Also Read:‘తమ్ముడు’ కోసం నితిన్ షాకింగ్ నిర్ణయం..?
నార్త్ లో టీజర్ ప్రమోషన్స్ కోసం కోట్ల ఖర్చు..
బాలయ్య అఖండ 2 నార్త్ లో కూడా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. అక్కడ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కొన్ని సీన్లు కూడా ఇందులో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలని ఈ టీజర్ ని రిలీజ్ చేయడానికి ముందు టీమ్ గట్టిగానే ప్రమోషన్స్ చేసింది.. అయితే ఈ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ దాదాపు రెండు కోట్ల వరకు ఖర్చు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ విన్న సినీ అభిమానులు టీజర్ ప్రమోషన్స్ కే ఇంత ఖర్చు చేశారా? మరి సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.. మరి దీనిపై టీం స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి..’అఖండ’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది. టీజర్ ద్వారా భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు గురువుగా మురళీమోహన్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు..