BigTV English

Vivo T4 Ultra: 32ఎంపీ సెల్ఫీ కెమెరా, 100x జూమ్.. పవర్‌ఫుల్ ఫీచర్లతో వివో టీ4 అల్ట్రా విడుదల

Vivo T4 Ultra: 32ఎంపీ సెల్ఫీ కెమెరా, 100x జూమ్.. పవర్‌ఫుల్ ఫీచర్లతో వివో టీ4 అల్ట్రా విడుదల

Vivo T4 Ultra| అద్భుతమైన కెమెరా ఫీచర్లతో స్టార్ట్‌ఫోన్లను అందించే వివో కంపెనీ భారతదేశంలో తన టీ4 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దాని పేరు వివో టీ4 అల్ట్రా. ఈ సిరీస్‌లో టీ4 5జీ, టీ4 ఎక్స్ 5జీ మోడల్స్‌తో పాటు వచ్చింది. ఇందులో మాంచి పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ (వెనుక భాగం) కెమెరా, 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు మీ కోసం.


వివో టీ4 అల్ట్రా ధర, లభ్యత వివరాలు

వివో టీ4 అల్ట్రా ధర 8జీబీ + 256జీబీ వేరియంట్‌కు రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ + 256జీబీ వేరియంట్ రూ. 39,999, మరియు 12జీబీ + 512జీబీ వేరియంట్ రూ. 41,999గా ఉంది. ఈ ఫోన్ మీటియర్ గ్రే, ఫీనిక్స్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. జూన్ 18 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, మరియు కొన్ని ఆఫ్‌లైన్ రిటైల్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 3,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.


వివో టీ4 అల్ట్రా ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల 1.5కే (1,260×2,800 పిక్సెల్స్) క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 300హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 5,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్ట్, SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఇది 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 12జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ జతచేయబడింది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై రన్ అవుతుంది.

కెమెరా ఫీచర్స్

వివో టీ4 అల్ట్రా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ సెన్సార్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో), 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ సోనీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్, 10x టెలిఫోటో మాక్రో జూమ్, 100x డిజిటల్ జూమ్) ఉన్నాయి. మెయిన్, టెలిఫోటో కెమెరాలు OIS, EIS సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, ఇతర ఫీచర్లు

ఈ ఫోన్‌లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ నానో సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై, ఓటీజీ, నావిక్‌తో జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. గూగుల్ సర్వీసెస్‌తో పాటు ఏఐ నోట్ అసిస్ట్, ఏఐ ఇరేజ్, ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఏఐ కాల్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: గూగుల్ ఎఐలో లోపాలు.. తప్పుడు సలహాలు, ప్రమాదకర సూచనలు

ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో దుమ్ము, వాటర్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. మీటియర్ గ్రే వేరియంట్ 160.5 x 75.02 x 7.43 మిమీ కొలతలు, 192గ్రా బరువు కలిగి ఉండగా.. ఫీనిక్స్ గోల్డ్ వేరియంట్ 7.45మిమీ మందంతో 193గ్రా బరువు కలిగి ఉంది.

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×