E-Paper
Advertisement

Kissik Talks: విష్ణుపై పృథ్వీ అలాంటి కామెంట్స్.. తట్టుకుంటుందా?

Kissik Talks: విష్ణుపై పృథ్వీ అలాంటి కామెంట్స్.. తట్టుకుంటుందా?
Advertisement

Kissik Talks: పృథ్వీరాజ్ శెట్టి(Prithviraj Shetty).. అన్నపూర్ణ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ‘నాగపంచమి’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సీరియల్ తోనే తన నటనతో ఆకట్టుకొని బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్ గా పాల్గొని తన పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ విష్ణుప్రియ (Vishnu Priya)తో ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అటు విష్ణుప్రియ పృథ్వీరాజ్ శెట్టి పై ప్రేమ కురిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పృథ్వీరాజ్ ఈమెను దూరం పెడుతున్నా.. అతడిపై తనకున్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా భీష్మించుకు కూర్చుంది.

పైగా బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ వీక్ లో భాగంగా పృథ్వీరాజ్ తల్లి వచ్చినప్పుడు ఎలాంటి కోడలు కావాలి అని అడగగా విష్ణు ప్రియ అయితే తనకు ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పృథ్వీరాజ్ కూడా తన తల్లి కోరిక మేరకు విష్ణుని వివాహం చేసుకుంటాడు అంటూ అభిమానులు కూడా అనుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత పలు షోలలో జంటగా పాల్గొంటున్నారే తప్ప తమ ప్రేమ విషయాన్ని పృథ్వీ మాత్రం బయట పెట్టడం లేదు. ఇదిలా ఉండగా తాజాగా అయినా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో బిగ్ టివి యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతోంది.

విష్ణుప్రియను అంతమాట అనేసిన పృథ్వీరాజ్..

Advertisement

ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ వర్ష మాట్లాడుతూ.. “విష్ణు ప్రియ ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?” అని ప్రశ్నించగా.. “ఆమెకు వయసు అయిపోయింది.. అందుకే నేనెప్పుడూ ఆమెను విష్ణు ప్రియ ఆంటీ అని పిలుస్తూ ఉంటాను”. అంటూ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఈ మాట విన్న తర్వాత వర్షా కూడా ఆశ్చర్యపోయింది. తర్వాత పృథ్వీరాజ్ మాట్లాడుతూ..” ఈ విషయాన్ని నేను విష్ణు ప్రియతో కూడా అంటూ ఉంటాను.. వయసు అయిపోయింది. త్వరగా పెళ్లి చేసుకో ఆంటీ అని అంటూ సరదాగా నవ్వించారు. విష్ణుప్రియను ఆంటీ అనడంతో ఆమె అభిమానులు విష్ణుప్రియ వింటే తట్టుకుంటుందా అంటూ కామెంట్లు చేశారు.

వాళ్ళిద్దరూ నా కళ్ళలాంటి వాళ్ళు..

బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని ప్రశ్నించగా.. నిఖిల్ (Nikhil), విష్ణు ప్రియ (Vishnu Priya)అని తెలిపారు పృథ్వీ. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమంటే ఎవరిని చెబుతారు అంటే.. వాళ్ళిద్దరూ నా కళ్ళ లాంటి వాళ్లు అని సమాధానం ఇచ్చారు. లేదు ఒకరి పేరే చెప్పాలని పృథ్విరాజ్ ను వర్ష అడగగా.. ఆయన విష్ణుప్రియ పేరు చెప్పారు. విష్ణు ప్రియ తనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని, అన్ని విషయాలలో తోడుంటుంది అని క్లారిటీ ఇచ్చారు. మరి పెళ్లి సంగతి ఏంటి? అని అడగగా.. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని చెబుతాను. అంటూ ఆమెను హార్ట్ చేశారు. ఇకపోతే లైవ్ లోనే విష్ణు ప్రియ కాల్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే.. అందుకే నీతో ఎక్కువ మాట్లాడలేను అని పృథ్వీ చెబుతారు. నాతో ఎక్కువ మాట్లాడితే ప్రేమలో పడిపోతావా అంటూ మళ్ళీ అడిగింది విష్ణు ప్రియ.. ఇక ఏం చెప్పాలో తెలియక కాల్ కట్ చేశారు పృథ్వీ.

Advertisement

ALSO READ:Film industry: నాగవంశీ ఫ్లోలో ఉన్నాడు.. మరి పోలిశెట్టి పని చేస్తాడా?

విష్ణుప్రియను పెళ్లి చేసుకునే ఆలోచన లేదా?

అలా మొత్తానికైతే పృథ్వీ విష్ణుప్రియను ఒక ఫ్రెండ్ గానే చూస్తున్నారు తప్పా.. ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవు అన్నట్టుగానే ఆయన మాటల్లో తెలుస్తోంది. మొత్తానికైతే వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పవచ్చు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అతడి పైనే ఆశలు పెట్టుకున్న విష్ణు ప్రియ అతడిని పెళ్లి చేసుకోకుండా ఉండగలదా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×