E-Paper
Advertisement

Kissik Talks: జీవితమే ఒక నరకం.. ఆ హేళనలు ఇప్పటికీ భరించలేను!

Kissik Talks: జీవితమే ఒక నరకం.. ఆ హేళనలు ఇప్పటికీ భరించలేను!
Advertisement

Kissik Talks:మనిషి అన్నాక జీవితంలో కష్టసుఖాలు సహజం. అయితే ఆ కష్టాలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే జీవితాంతం మన కట్టి కాలే వరకు వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆ కష్టాల తాలూకు అనుభవాలు తన జీవితంలో ఎన్నో ఉన్నాయని.. ముఖ్యంగా ఆ హేళనలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ శెట్టి. ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు పృథ్వీరాజ్ శెట్టి. ఇంటర్వ్యూలో భాగంగా తన పర్సనల్ లైఫ్ కెరియర్ గురించి చెప్పుకొచ్చిన ఈయన బాల్యం గురించి, అలాగే తన తండ్రి మరణం తర్వాత తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

దేవుడు ఎదురుగా వస్తే అడిగే మొదటి కోరిక అదే..

జీవితంలో మీరు మర్చిపోలేని ఇబ్బందులు ఏవైనా ఎదుర్కొన్నారా? అని ప్రశ్నించగా.. మా నాన్న మరణం.. మమ్మల్ని ఒంటరిని చేసింది. దేవుడు ఎదురుగా వచ్చి ఏదైనా కోరమని అడిగితే.. మా నాన్నను మళ్ళీ తిరిగి ఇవ్వమని కోరతాను. ఆయన కనిపించిన వెంటనే హగ్ చేసుకుని ఐ లవ్ యు అని చెబుతాను అంటూ తన తండ్రి పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. చిన్న వయసులోనే తన తండ్రి మరణించారని తన తల్లి సింగిల్ పేరెంట్ గా తమను పోషించిందని చెప్పుకొచ్చారు పృథ్వీ.

Advertisement

also read:Kissik Talks: ఆమె వల్లే ఇండస్ట్రీలోకి వచ్చా.. కానీ.. బ్రేకప్ పై పృథ్వీరాజ్ ఎమోషనల్!

ఆ హేళనలు ఇప్పటికీ మరువలేను..

పృథ్వీ మాట్లాడుతూ..” నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మా బంధువుల పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కూడా వెళ్లడం మానేశాను. మా అమ్మను చూసి మా కొడుకు ఇంజనీర్, మా కొడుకు డాక్టర్ అని మమ్మల్ని తెగ ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా ఆ హేళనలు నన్ను మరింత ఇబ్బందులకు గురిచేసాయి. అప్పుడు ఎన్నో చూశాను. ముఖ్యంగా మా నాన్న లేకపోవడం మమ్మల్ని ఒంటరిని చేసింది. ఇక బంధువులే రాబందుల్లా పొడుస్తుంటే ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని ఆరాటపడ్డాను. అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. ధైర్యంగా బంధువుల పెళ్లిలకు , ఫంక్షన్లకు వెళ్తుంటే వాళ్లే ఇప్పుడు నా స్థాయిని చూసి పొగుడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్ శెట్టి. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సందీప్ నెక్స్ట్ హీరో నేనే..

Advertisement

ఇకపోతే తన కెరియర్ గురించి మాట్లాడుతూ.. యానిమల్, కే జి ఎఫ్ వంటి చిత్రాలలో నేను నటించి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక సందీప్ రెడ్డివంగా నెక్స్ట్ హీరో నేనే. ఆయనకు మెసేజ్ కూడా పెట్టాను. సార్ మీ నెక్స్ట్ హీరో నేనే.. మీ సినిమాలో నాకు చాన్స్ ఇవ్వండి అని. కానీ ఆయన నుంచి రిప్లై రాలేదు.. వస్తే మాత్రం నేనే ఆయన నెక్స్ట్ హీరో అంటూ ధీమా వ్యక్తం చేశారు పృథ్వీరాజ్ శెట్టి. మొత్తానికి అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాలకు కరెక్ట్ గా సెట్ అయ్యే కటౌట్ కావడంతో అభిమానులు కూడా వీ ఆర్ వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×