E-Paper
Advertisement

Hyderabad News: సంక్రాంతి పండగ ప్రయాణం.. హైదరాబాద్‌ పోలీసుల అలర్ట్.. ఇలా చేస్తే మీ ఇల్లు సేఫ్

Hyderabad News: సంక్రాంతి పండగ ప్రయాణం.. హైదరాబాద్‌ పోలీసుల అలర్ట్..  ఇలా చేస్తే మీ ఇల్లు సేఫ్
Advertisement

Hyderabad News: సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం బోసిపోతుంది. సిటీ నుంచి ఏపీలోని సొంతూళ్లకు లక్షలాది మంది పయనమవుతారు. అందుకోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లు, బస్సులు వేస్తుంటాయి. అయినా టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటాయి. ఇదే అదునుగా భావించి దొంగలు చెలరేగిపోతుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్‌వాసులకు మూడు పోలీసు కమిషనరేట్ల పోలీసు అధికారులు కీలక సూచనలు చేశారు. వాటిలో ఏ ఒక్కటి మిస్సయినా ఇళ్లు గుల్లయిపోవడం ఖాయం.

హైదరాబాద్‌వాసులకు పోలీసుల అలర్ట్

Advertisement

ప్రతీ ఏటా సంక్రాంతికి హైదరాబాద్ సిటీ నుంచి సొంతూరు దాదాపు 25 నుంచి 40 లక్షల మంది వరకు వెళ్తుంటారు. అందుకోసం ఏపీకి వెళ్లేవారికి శాతం ఎక్కువగా ఉంటుంది.  తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా లకు వెళ్తుంటారు.  అందుకోసం ముందుగా ప్లాన్ చేసుకుంటారు. పండుగను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు దొంగలు. 

ఊళ్లకి వెళ్లే వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. గతంలో ఈ తరహా ఘటనలు చాలానే జరిగాయి కూడా. వాటిని దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ అధికారులు శనివారం సమావేశం అయ్యారు. కీలక సూచనలు చేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.

Advertisement

ఇలా చేస్తే మీ ఇల్లు సేఫ్-పోలీసుల సూచనలు

ప్రజలు కూడా ఊరు వెళ్ళేటప్పుడు బంగారు ఆభరణాలను ఇంట్లో పెట్టకుండా లాకర్లు లేకుంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలన్నారు. అలాగే ఊరు వెళ్ళేటప్పుడు మీ ఇంటి తాళం చెవిని ఇంటి పక్క వాళ్లకు ఇవ్వడం, షూ రాకుల్లో పెట్టడం చేయవద్దన్నారు. వ్యక్తుల మానసిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని తాళం చెవి ఎక్కడ పెడతామో దొంగలు ముందుగానే అంచనా వేస్తారని తెలిపారు.

ఇంటి ఒరిజినల్ కీని మీ వెంటే స్వయంగా తీసుకెళ్లాలని తెలిపారు. గతంలో పండుగ సందర్భంగా జరిగిన దొంగతనాలు జరిగిన ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. వాటిని హాట్ స్పాట్‌లుగా గుర్తించాము. అలాగే బస్టాండ్, రైల్వేస్టేషన్లు, హోటల్స్ ప్రత్యేకంగా తనిఖీలు చేస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. చైన్‌ స్నాచింగ్, టూ వీలర్స్ చోరీకి గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు సమీపంలో పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై ప్రత్యేకంగా నిఘా పెడతారని తెలిపారు. గతంలో నేరాలు నమోదైన ప్రాంతాలను గుర్తించి, గస్తీ పెంచడం, ఆపై తనిఖీలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ:  చేప చర్మంతో కుక్కకు సర్జరీ, హైదరాబాద్ డాక్టర్ల ఘనత

సొంత ఇళ్లయితే ఇంటి ముందు తలుపులకు సెంటర్‌ లాక్‌ వేయాలి. ఇంటి ముందు నిత్యం చెప్పులు ఉండేలా చూడాలి. బయట గేటుకు లోపలి నుంచి తాళం తప్పకుండా వేయాలి. అలాగే పేపర్‌ బాయ్, పాలు పోసేవారికి ముందుగా చెప్పాలి. ఊరికి వెళ్లేటప్పుడు నమ్మకమైనవారు, పోలీసులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి. ఇక కాలనీ, ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని తెలిపారు.

ఇంటి తలుపుకు వేసిన తాళం బయటకు కనిపించకుండా అడ్డుగా పరదా వేయాలన్నారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బీరువా తాళాలు, ఇంట్లో కబ్‌ బోర్డులు సులువుగా గుర్తించే ప్రదేశాల్లో ఉంచకూడదని ముఖ్యమైన సూచన. రాత్రుళ్లు ఇంట్లోని ఓ గదిలో లైట్‌ వెలిగేలా చూసుకోవాలి. ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉండాలి.

 

 

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×