E-Paper
Advertisement

Thieves Steal Thar Tyres: దొంగల దుస్సాహసం.. కారులో వచ్చి థార్ టైర్లు చోరీ, వాహనం కింద పడకుండా

Thieves Steal Thar Tyres: దొంగల దుస్సాహసం.. కారులో వచ్చి థార్ టైర్లు చోరీ,  వాహనం కింద పడకుండా
Advertisement

Thieves Steal Thar Tyres: దొంగలు రూటు మార్చారు. ఒకప్పుడు ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకుపోయేవారు. ఇప్పుడు అలా కాదు.. ఏకంగా వాహనాలను దొంగిలిస్తున్నారు. అలాంటి షాకింగ్ ఘటన గ్రేటర్ నొయిడాలో చోటు చేసుకుంది. అసలు మేటరేంటి? దీనికి సంబందించి వీడియో వైరల్ అయ్యింది.

Advertisement

గ్రేటర్ నొయిడాలో దొంగల దుస్సాహసం

Advertisement

దొంగతనాలకు పాల్పడేవారు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఒకప్పుడు ఇళ్లపై పడి చోరీలు చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. బంగారు, డబ్బులు బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ ఒమిక్రాన్-2కి కారులో వచ్చారు దొంగలు. అర్ధరాత్రి కావడంతో ఆ సమయంలో చాలామంది గాఢ నిద్రలో ఉన్నారు. రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన మహీంద్రా థార్ కారు వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఆ వాహనం రెండు టైర్లను వాహనం నుంచి తొలగించారు. కారు కింద పడితే శబ్దం వస్తుందని భావించారు. దీంతో థార్ వాహనం వెనుక చక్రాలపై ఇటుకలపై ఉంచారు.

థార్ టైర్లు చోరీ, వాహనం కింద పడకుండా ఇటుకలతో స్కెచ్

టైర్లు తొలగించిన సమయంలో చిన్నపాటి శబ్దం వచ్చింది. దీంతో ఇరుగుపొరుగు మేల్కొని బయటకు వచ్చారు. వారిని గమనించిన దొంగలు భయపడ్డారు. వీధిలో ఆపిన కారు వద్దకు టైర్లు పట్టుకుని పరుగులు పెట్టారు. దొంగిలించిన థార్ టైర్లను కారు వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ సంఘటన తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్య జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన థార్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. దొంగలను గుర్తించడానికి పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

ALSO READ:  హెల్మెట్ లేకుంటే ఈ కాఫీ షాపులో అడుగు పెట్టలేరు

కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ సంఘటన తర్వాత ఓమిక్రాన్-2 సెక్టార్ ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో పోలీసుల భద్రత బలహీనంగా ఉందని చెబుతున్నారు. సెక్టార్ సరిహద్దు గోడపై కంచె లేకపోవడం వల్ల దొంగతనాల వంటి నేరాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

గ్రేటర్ నోయిడా అథారిటీ అధికారులకు స్థానికవాసులు ఫిర్యాదు చేశారు . సరిహద్దు గోడపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని సంఘటనలు జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సెక్టార్‌లో రాత్రి వేళ గస్తీని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×