Kissik Talks: బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షోకి తాజాగా పృథ్వీరాజ్ గెస్ట్ గా వచ్చారు. ఇందులో యాంకర్ వర్ష అడిగిన ప్రశ్నలకు పృథ్వీ సమాధానాలను తెలియజేశారు. ఎలా ఉన్నావ్ విష్ణు పృథ్వీను చూసి ఆట పట్టిస్తుంది వర్ష. మళ్లీ సారీ సారీ పృథ్వీ ఎలా ఉన్నావ్ అని అడగగా.. బాగున్నానని చెబుతారు పృథ్వీ. అనంతరం విష్ణుప్రియ పేరు చెప్పగానే బుగ్గలు బ్లష్ అవుతున్నాయి.. ఏంటి అంటూ అడుగుతుంది. గడ్డం పెంచావు ఏంటి బ్రేకప్ అయ్యిందా? లేక విష్ణు ప్రియ కోసం పెంచావా అని ప్రశ్నించగా? గడ్డం నేను డిగ్రీ చదువుతున్న సమయం నుంచే పెంచానని చెప్పారు పృథ్వీ. అలాగే కాలేజీలో ఏదైనా స్వీట్ మెమోరీ ఉందా అంటూ అడగగా? గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగడం, క్లాస్ బంద్ కొట్టడం ఇవే మా పనులు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ తో ఏదైనా ఇప్పటికీ మర్చిపోలేని మూమెంట్ ఉందా? అని అడిగితే అది బ్రేకప్ అంటూ చెప్పారు పృథ్వీ.
ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనిపించింది అని ప్రశ్నించగా.. అసలు నాకు ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన కూడా లేదు.కానీ నా గర్ల్ ఫ్రెండ్ వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. మేమిద్దరం ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు హీరోలా ఉంటావు.. సినిమాలలో ఎందుకు ట్రై చేయకూడదు అంటూ ఆమె నన్ను అడిగింది. అదే నాలో ఆలోచన కలిగేలా చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఒకసారి ఆడిషన్ జరుగుతుంటే వెళ్లాను. అక్కడ ఒక సీరియల్ కి సెలక్ట్ అయ్యాను అలా మొదలైన నా నటనా ప్రయాణం తెలుగులో నాగపంచమి, ఆ తర్వాత బిగ్ బాస్ 8 , ఇప్పుడు ఒక కన్నడ సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నాను.. త్వరలో ఆ సినిమా తెలుగులో కూడా డబ్ కూడా కావచ్చు అంటూ తన నటనా ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు.
also read:Kissik Talks: విష్ణుపై పృథ్వీ అలాంటి కామెంట్స్.. తట్టుకుంటుందా?
ఇకపోతే బ్రేకప్ పై మీ స్పందన ఏమిటి? అని ప్రశ్నించగా.. ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాను అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు పృథ్వీరాజ్ శెట్టి. ప్రస్తుతం సింగిల్ కదా త్వరలో మింగిల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. నేను సింగిలే కానీ మింగిల్ అవ్వడానికి సిద్ధంగా లేను. అయినా ప్రేమించడం అంటే సులభం కాదు.. ఆ బ్రేకప్ ని కూడా తట్టుకోగలగాలి. ప్రస్తుతం నాకు ఆ శక్తి లేదు. అయినా ప్రేమించాలి అంటే ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడే ప్రేమ కొనసాగుతుంది. అంత టైం కూడా నా దగ్గర లేదు అంటూ కామెంట్ చేశారు పృథ్వీరాజ్. మొత్తానికైతే ఈయన చెప్పిన మాటలను బట్టి చూస్తే మొదటి ప్రేమ విషయంలో ఇప్పటికీ ఆ బాధను భరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అంటూ నేటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.